జలుమూరు : శ్రీముఖలింగంలో ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే మహా శివరాత్రి ఉత్సవాలలో భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. ఉత్సవ ఏర్పాట్లపై శనివారం శ్రీముఖలింగంలో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహ ణ, తాత్కాలిక మరుగుదొడ్ల ఏర్పాటు పకడ్బందీగా ఉండాలన్నారు. చల్లవానిపేట, కొమనాపల్లి, కరకవలస వరకు పారిశుద్ధ్య పనులు చేయించాలన్నారు. చక్రతీర్థ స్నానాల సమయంలో భక్తులు ఇబ్బందిపడకుండా నదిలో తగినంత నీరు ఉంచాలని వంశధార ఎస్‌ఈ తిరుపతిరావును అదేశించారు. టెక్కలి డీఎస్పీ ఎ.వి.ఎస్.ఎన్.మూర్తి మాట్లాడుతూ వీఐపీల దర్శనం కోసం ఆలయం వెనుక భాగం నుంచి క్యూలైన్ ఏర్పాటు చేశామని చెప్పారు. డీఎంహెచ్‌ఓ బాలమురళీకృష్ణ మాట్లాడుతూ మూడు రోజుల పాటు వైద్య శిబిరాలతో పాటు 108,104 వాహనాలు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. దేవదాయ శాఖ అందించే ప్రసాదాలు గంటలోనే అయిపోతుండడంతో దూరప్రాంత భక్తులు ఇబ్బంది పడుతున్నారని సర్పంచ్ టి.సతీష్‌కుమార్, అర్చకులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ఆయన స్పంది స్తూ దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రసాదాలు సిద్ధంకాని పక్షంలో కాంట్రాక్టర్‌కు అప్పగించి భక్తులకు ఇబ్బందులు లేకుండా ప్రసాదాలు పంపిణీ చేయాలని దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్ పట్నాయక్‌ను ఆదేశించారు. సమావేశంలో ఆర్డీఓ సాయి ప్రత్యూష ఎస్‌ఈ ఎహసోన్ బాషా, డీసీ సుజాత, తహసీల్దార్ జెన్ని రామారావు, ఎంపీడీఓ కె.అప్పలనాయు డు, పంచాయతీ విస్తరణాధికారి ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment