గంజాయి మాఫియాపై ఉక్కుపాదం
ఎచ్చెర్ల క్యాంపస్: గంజాయి అక్రమ సరఫరా, అమ్మకం వంటి కేసుల్లో నేరస్తులకు కచ్చితంగా శిక్షలు పడాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపినాథ్ జెట్టి అన్నారు. ఎచ్చెర్లలోని శ్రీ వేంకటేశ్వరా ఇంజినీరింగ్ కళాశాల సెమినార్ హాలు వేదికగా శనివారం శ్రీకాకుళం, విజయ నగరం, పార్వతీపురం మన్యం జిల్లాల పోలీస్ అధికారులకు గంజాయి, ఇతర మాదక ద్రవ్యా లు నియంత్రణ కేసులు, చట్టపరంగా తీసుకోవల్సిన జాగ్రత్తలపై ఒక్క రోజు వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ గంజాయి కేసులు దర్యాప్తు పక్కాగా సాగాలన్నారు. అనంతరం కస్టమ్స్, ఎకై ్సజ్, సర్వీస్ టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ అధికారి ఎ.రంగనాథమ్ మాదక ద్రవ్యాలు–చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, పార్వతీపురం మన్యం జిల్లా ఏఎస్పీ అంకిత సురాన, డీఎస్పీలు అప్పారావు, శ్రీనివాసరా వు, ప్రసాదరావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment