అటు సిండికేటు.. ఇటు అదనపు రేటు
మందు బాబులకు
ఝలక్
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో మద్యం దోపిడీకి అధికార పార్టీ నాయకులు తెర తీశారు. ఒకనేత అంతా తానై వ్యవహరించి, సిండికేట్‌కు నాయకత్వం వహించి, పలాస నియోజకవర్గంలో వసూళ్లకు శ్రీకారం చుట్టారు. కీలక నేతకు ముడుపులు ఇచ్చేందుకు ఒప్పందం జరగడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనంగా వేసి షాపుల్లో విక్రయిస్తున్నారు.
2014–19 పరిస్థితులు పునరావృతం
ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరపడం కొత్తేమీ కాదు. 2014–19 టీడీపీ హయాంలో బరితెగించి విక్రయాలు చేపట్టారు. ఒక్కో బాటిల్‌పై రూ.20 నుంచి రూ.50 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. అప్పట్లో ఎమ్మార్పీకి మించి చేపట్టిన విక్రయాలపై మద్యం బాబుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంట్లో డబ్బు అంతా మద్యానికి పోసేస్తున్నారని మహిళలు ఆందోళన చేశారు. అప్పట్లో లిక్కర్ వ్యాపారులు భారీగా సంపాదించారు. అందులో కొంత నేతలకు ముట్ట జెప్పారు. అది జిల్లా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్లీ ఇప్పుడా పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇప్పటికే బెల్ట్‌షాపులు విచ్చలవిడిగా వెలిశాయి. అదే తప్పు అని గగ్గోలు పెడుతుంటే, ఇప్పుడు ఎమ్మార్పీకి మించి విక్రయాలు మొదలయ్యాయి. పలాస నియోజకవర్గంలో తొలుత శ్రీకారం చుట్టారు. ఇప్పుడది జిల్లా అంతా పాకే పరిస్థితి కనబడుతోంది.
చక్రం తిప్పిన నాయకుడు..
మద్యం షాపులను దక్కించుకున్న ఓ నాయకుడు కీలకంగా వ్యవహరించి, సిండికేట్‌ను ఏర్పాటు చేసి, అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. ఎవరికెంత ముడుపులు ఇవ్వాలో డిసైడ్ చేసి, తదనుగుణంగా కీలక నేతకు జరిగినదంతా చెప్పి, ఎమ్మార్పీకి మించి విక్రయాలకు తలుపులు తెరిచారు. ఏకంగా ఎకై ్సజ్ పరిధిలో నిర్ణయాన్ని అమలు పరిచారు. ప్రస్తుతానికి ఒక్కో క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయిస్తున్నారు. మున్ముందు ఈ పెంపు మరింత పెరగనుంది. జిల్లాలో తొలుత పలాస నియోజకవర్గం, సర్కిల్ పరిధిలోనే ప్రారంభించారు. కీలక నేత అండదండలతో ముందుకెళ్తున్నారు.
మొదలైన మద్యం దోపిడీ
ఒక్కో బాటిల్‌పై రూ.10 అదనపు వడ్డన
పలాస నియోజకవర్గంలో శ్రీకారం
సిండికేట్‌ను తయారు చేసిన ఓ నాయకుడు
కీలక నేత అంగీకరించడంతో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు గ్రీన్ సిగ్నల్
Comments
Please login to add a commentAdd a comment