No Headline
వచ్చిన తర్వాత దసరా, దీపావళి, సంక్రాంతి మూడు పెద్ద పండగలు గడిచినా ఒక డీఏ కూడా ఇవ్వలేదు. 2022 జూలైలో దరఖాస్తు చేసుకున్న ప్రావిడెంట్ ఫండ్, రుణాలు, ఏపీ ఉద్యోగుల జీవిత బీమా అడ్వాన్సులు, పదవీ విరమణ చేసిన వారికి ఈ రోజుకి కూడా చెల్లింపులు చేయలేదు. ఎంతసేపూ గత ప్రభుత్వంపై నెపం నెట్టడమే తప్ప ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇటీవల సంక్రాంతి సందర్భంలో బకాయి చెల్లింపునకు భారీగా నిధులు విడుదల చేసినట్టు చెప్పుకున్నారే తప్ప రాష్ట్రంలో ఏ ఉద్యోగి ఖాతాలో రూపాయి కూడా జమ చేయలేదు. ఇలా మరెన్నో నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఉపాధ్యాయులు తట్టుకోలేకపోతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. టీడీపీ, జనసేన పార్టీలు భుజాన వేసుకున్న రఘువర్మను ఓడించేలా చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment