కాశీబుగ్గ: తాళి కట్టి రెండు నెలలైనా అవ్వలేదు.. నూతన వధువు కాళ్ల పారాణి కూడా పూర్తిగా ఆరలేదు.. కొత్త దంపతుల ముచ్చట్లే తీరలేదు.. అంతలోనే విధికి కన్నుకుట్టింది. రోడ్డు ప్రమాదం రూ పంలో ముంచుకొచ్చిన మృత్యువు వరుడిని తనతో తీసుకెళ్లిపోయి వధువుకు తీరని శోకం మిగిల్చింది. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కోసంగిపురం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పలాస మండలం గొల్లమాకన్నపల్లి గ్రామానికి చెందిన కోరాడ మధుసూదన్ యాదవ్ (28) మృతి చెందారు. ఆయన వివాహం జరిగి కేవలం 48 రోజులైంది.
గొల్లమాకన్నపల్లికి చెందిన మధుసూదన్ మంగళవారం పలాసలో మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి తన బుల్లెట్‌పై బయల్దేరారు. అక్కడ పనిచూసుకుని తిరిగి వస్తుండగా కోసంగిపురం జాతీ య రహదారిపై అతడి బండి ప్రమాదానికి గురై 50 మీటర్ల దూరం అవతల పడిపోయాడు. రాత్రి పూట ప్రమాదం జరగడంతో వెనుక నుంచి వాహనం ఢీకొట్టిందా, లేదా బండి స్కిడ్ అయ్యిందా అన్నది
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి