చంద్రబాబువన్నీ బూటకపు హామీలే | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబువన్నీ బూటకపు హామీలే

Mar 29 2025 12:48 AM | Updated on Mar 29 2025 12:44 AM

వైఎస్సార్‌ సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి

పాతపట్నం: ఎన్నికల్లో చంద్రబాబు బూటకపు హామీలతో రాష్ట్ర ప్రజలు దారుణంగా మోసపోయారని వైఎస్సార్‌ సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. క్రమశిక్షణ కమిటీ సభ్యురాలిగా నియమితులైన సందర్భంగా రెడ్డి శాంతిని పాతపట్నంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ నాయకులు శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగనన్న పాలన ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకునేలా ఉండేదన్నారు. చంద్రబాబు మాత్రం హామీలు అమలు చేయకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. రైతులు, మహిళ లు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారిని నమ్మించి మోసం చేశారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో పాతపట్నం, ఎల్‌.ఎన్‌.పేట ఎంపీపీలు దొర సావిత్రమ్మ, రెడ్డి జ్యోతి లక్ష్మి, బైపోతు ఉదయ్‌కుమార్‌, పార్టీ మండల అధ్యక్షులు సవిరిగాన ప్రదీప్‌, పోలా కి జయమునిరావు, మీసాల వెంకటరామకృష్ణ, గండివలస ఆనంద్‌, పెనుమజ్జి విష్ణుమూర్తి, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, అంధవరపు సురేష్‌, కొల్ల కృష్ణ, ఆర్‌టీఐ వింగ్‌ ఎనుగుతల సూర్యం, ఎం.తాతయ్య, శిమ్మ శాంబ, లోలుగు లక్ష్మణ, యెరుకొల వెంకటరమణ, బి.నారాయణమూర్తి, మాదవ పుల్లయ్య, ఎం.గణపతిరావు, సవర సుబాష్‌, అలికాన మాదవరావు, గంగధర్‌, సరస్వతి, రాజ్యలక్ష్మి, జానకమ్మ, ఎం.రామారావు, తులుగు ప్రవీణ్‌, నర్సింహమూర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement