సాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలి
భానుపురి: జిల్లాలో సాగునీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ తెలిపారు. పంటలకు సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, సంక్షేమ హాస్టళ్లలో సౌకర్యాల పరిశీలన, సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు పై సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో జిల్లా జిల్లా నుంచి కలెక్టరేట్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎండకాలంలో పంటలను రక్షించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్ సీఈ రమేష్, విద్యుత్‌శాఖ సీఈ ఫ్రాక్లిన్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి నాగయ్య, ఇరిగేషన్ ఈఈలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment