హుజూర్‌నగర్: ప్రాథమిక పాఠశాల్లోని 3, 4, 5 తరగతులకు చెందిన ‘సీ’ గ్రేడ్ విద్యార్థుల్లో మెరుగైన విద్యాసామర్థ్యాల సాధనకు తీసుకొచ్చిన కృత్రిమ మేధ (ఏఐ)తో విద్యాబోధన శనివారం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 13 పాఠశాలలను ఎంపిక చేయగా ఆయా పాఠశాలల్లో 3, 4, 5 తరగతులకు చెందిన 616 మంది విద్యార్థులకు గాను 130 మంది ‘సీ’ గ్రేడ్ విద్యార్థులకు పాఠాలు మొదలు పెట్టారు. వారికి 70 కంప్యూటర్ల ద్వారా తెలుగు వాచకం, గణిత అభ్యాసాలపై 20 నిమిషాల వ్యవధిలో పాఠాలు బోధించారు. కాగా చివ్వెంల మండలం వట్టిఖమ్మంపహాడ్‌లో అదనపు కలెక్టర్ రాంబాబు, డీఈఓ అశోక్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిద మండలాల్లో ఎంఈఓలు, ఎంఎన్‌ఓలు, ఆయాపాఠశాలల హెఎంలు ప్రారంభించారు.
ఫ ఎంపిక చేసిన పాఠశాలల్లో
తొలి రోజు పాఠాలు
ఫ పర్యవేక్షించిన అదనపు కలెక్టర్, డీఈఓ