యాదగిరిగుట్ట రూరల్: యాదగిరిగుట్ట ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. దీంతో ధర్మదర్శనానికి సుమారు రెండు గంటల సమయం, వీఐపీ దర్శనానికి గంట సమయం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారికి నిత్యాదాయం రూ.49,28,666 సమకూరిందని ఆలయ ఈఓ భాస్కర్‌రావు తెలిపారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
మద్దిరాల: విద్యుదాఘాతానికి గురైన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల మండలం చిన్ననెమిలా గ్రామానికి చెందిన యాట సైదులు(51) తన వ్యవసాయ పొలం వద్ద శనివారం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అతడిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు సందీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ కల్వల శ్రీనివాస్ తెలిపారు. మృతుడి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
యాదగిరిగుట్ట ఆలయంలో భక్తుల రద్దీ