భానుపురి: తేనెటీగల పెంపకంతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సునీత అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్‌లో నేషనల్ బి బోర్డు ఆధ్వర్యంలో శాసీ్త్రయ తేనెటీగల పెంపకంపైవ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సదస్సులో ఆమె మాట్లాడారు. ఉద్యాన పంటలైన నువ్వులు, ఆవాలు, కుసుమ కంది, పొలాల్లో తేనెటీగల పెట్టెలను అమర్చి లాభాలను పొందవచ్చని తెలిపారు. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా వీటిని పెంచొచ్చని, తద్వారా వినియోగదారులకు స్థానికంగా తక్కువ ధరకు స్వచ్ఛమైన నాణ్యమైన తేనె దొరుకుతుందన్నారు. ఈ సదస్సులో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రజనీకాంత్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ అధికారి నాగయ్య, ఉద్యాన శాఖ అధికారులు, ఏడీఏలు, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ సునీత