
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా
నేరేడుచర్ల : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకు బీజేపీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెడతారా అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అన్నారు. మంగళవారం నేరేడుచర్ల బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సన్న బియ్యం పంపిణీకి కేంద్ర ప్రభుత్వం రూ.40 భరిస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీలో రూ.10 మాత్రమే ఖర్చు చేస్తూ గొప్పలు చెప్పుకుంటోందన్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలను అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. స మావేశంలో బాల వెంకటేశ్వర్లు, తాళ్ల నరేందర్‌రెడ్డి, నాగిరెడ్డి, వీరబాబు, నర్రినాయక్, లాజర్, విజయభాస్కర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు, శంకర్‌రెడ్డి, నాగయ్య, రామ్మూర్తి పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి