
అన్నానగర్: కలరంపట్టి సమీపంలో పిల్లలు లేరనే ఆవేదనతో మంగళవారం ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పెరంబలూరు జిల్లా కలరంపట్టి ఉత్తర వీధికి చెందిన జగన్, అతడి భార్య రంజనీదేవి (33). వీరికి పెళ్లయ్యి ఏడేళ్లయ్యింది. వారికి పిల్లలు లేరు. దీంతో రంజనీదేవి మనస్థాపంతో ఉంటూ వచ్చింది. ఈక్రమంలో మంగళవారం వేకువజామున రంజనీదేవి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
పెరంబలూరు పోలీసులు రంజనీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెరంబలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు ముందు రంజనీదేవి తన సెల్‌ఫోన్‌లో శ్రీ నా చావుకు ఎవరూ కారణం కాదుశ్రీ అంటూ వీడియో రికార్డ్ చేసింది. పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment