తమిళసినిమా: ఒకప్పుడు హిజ్రాలను చిన్నచూపు చూసిన సమాజంలో ఇప్పుడు వారు తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకుంటున్నారు. ఎందరో ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లోనూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. అలా అమ్మాయిగా మారిన సంయుక్త విజయన్ దర్శకుడుగా అవతారమెత్తి తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ (నీలి రంగ సూర్యుడు).
తమిళంలో సినీ దర్శకురాలిగా పరిచయం అవుతున్న తొలి హిజ్రా ఈమెనే అన్నది గమనార్హం. కాగా ఫస్ట్ కాపీ ప్రొడక్షన్ పతాకంపై మాలా మణియన్ నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త విజయన్‌తో పాటు గీతా కై లాసం, గజరాజ్, మషాంత్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర వివరాలను సంయుక్త విజయన్ తెలుపుతూ ఒక మగవాడు యువతిగా మారాలనుకోవడంతో పాటు మన సమాజం వారిని ఎలా అవమానిస్తుందీ, వాటన్నింటినీ అధిగమించి వారు ఎలా సాధిస్తారు.
అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కించిన చిత్రం నీల నిర సూర్యన్ అని చెప్పారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని అక్టోబరు 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ చిత్రం ఐఎఫ్‌ఎఫ్‌ఐ 23 తదితర పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి ప్రపంచ ప్రేక్షకులతో పాటు మంచి చిత్రాలను ఇష్టపడే సినిమా ప్రియుల అభినందనలు అందుకుందని దర్శకురాలు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రానికి స్టీవ్ బెంజిమెన్ సంగీతాన్ని, చాయాగ్రహణం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment