సూరసంహార ఘట్టం సమయంలో భక్తులు ఉగ్రరూపం
వివిధ వేషాల్లో తరలివచ్చిన భక్తులు
సూరసంహార ఘట్టాన్ని తిలకిస్తున్న భక్తులు
సాక్షి, చైన్నె: రాష్ట్ర ప్రజలు శుక్రవారం ఆయుధ పూజ పండుగను జరుపుకున్నారు. ఇక శనివారం విజయ దశమి సందర్భంగా ఇళ్లల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయ దశమిని పురస్కరించుకుని రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలో భక్తిభావం మిన్నంటింది. ఉదయం నుంచి ఆలయాలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఉత్సవ వేడుకలు జరిగాయి. ఇందులో భాగంగా కుల శేఖర పట్నంలో ఆధ్యాత్మిక వాతావరణం నడుమ మహిషాసుర సంహారం సాగింది.
రాత్రంతా పూజలు..
కర్ణాటక రాష్ట్రం మైసూర్ తర్వాత దసరా ఉత్సవాలకు రాష్ట్రంలోని కులశేఖర పట్నం ప్రసిద్ధి చెందిన విష యం తెలిసిందే. తూత్తుకుడి జిల్లాలోని ఈ కులశేఖర పట్నంలో ముత్తారమ్మన్ దేవిగా కాళీ మాత కొలువై ఉన్నారు. ఆలయంలో వారం రోజులుగా దసరా వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతూ వచ్చాయి. రో జూ రాత్రి వేళ అమ్మవారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనం ఇస్తూ వచ్చారు. ఉత్సవాలో ముఖ్య ఘట్టం శనివారం సాగింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఆలయంలో అమ్మవారికి పలుమార్లు అభిషేకాలు జరిగాయి. వేలాదిగా భక్తులు కాళీమాత, శివుడు, సుబ్రహ్మణ్య స్వామి, హనుమంతుడు తదితర దేవతలు, దేవళ్ల వేషాలలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఉత్సవాలు మొదలైన రోజు నుంచి ఊరూరా తిరిగి తాము సేకరించిన విరాళాల్ని ఆలయంలో కానుకలుగా సమర్పించారు. వివిధ వేషాలలో వచ్చిన భక్తులు చేతిలో మట్టి పాత్రలను పెట్టుకుని అందులో కర్పూరాన్ని వెలిగించి ఊరేగింపుగా ఆలయాల వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు.
అద్వితీయంగా సూరసంహారం..
అర్ధరాత్రి 11 గంటల సమయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకారం, విశేష పూజలు చేశారు. 12 గంటల సమయంలో అమ్మవారు సింహవానాన్ని అధిరోహించి సముద్ర తీరం వైపుగా కదిలారు. ఈ సమయంలో భక్తులు ఓం కాళీ..జై కాళీ అన్న నామస్మరనను మార్మోగించారు. సాగర తీరంలోని చిదంబరేశ్వరర్ ఆలయం వద్దకు చేరుకున్నారు. ఇక్కడ అర్ధరాత్రి వేళ మహిషాసూర సంహారఘట్టం అత్యంత వేడుకగా అద్వితీయంగా జరిగింది. ఇసుక వేస్తే రాలనంతగా లక్షల్లో తరలి వచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సూర సంహార ఘట్టం జరిగింది. ఇక్కడి నుంచి అమ్మవారు చిదంబరేశ్వర్ ఆలయంలోకి చేరుకున్నారు. ఇక్కడ ఆదివారం వేకువ జామున అమ్మవారికి గంధం వంటి సుగంద ద్రవ్యాలతో అభిషేకం సాగింది. ఆరు గంటల వరకు అమ్మవారికి పలు విడతలుగా అభిషేకాలు, ఆరాదనలు జరిగాయి. మధ్యాహ్నం వరకు భక్తులకు అమ్మవారు ఇక్కడే దర్శనం ఇచ్చారు. సాయంత్రం 4.30 గంటలకు అమ్మవారు మళ్లీ ఆలయానికి బయలుదేరి వెళ్లారు. రాత్రంతా సూర సంహార ఘట్టం అద్వితీయంగా సాగింది. తిరునల్వేలి,తూత్తుకుడి, రామనాథపురం జిల్లాల పోలీసులు బందోబస్తు చేపట్టారు. మొత్తం 7 లక్షల మందికి పైగా భక్తులు తరలి వచ్చినట్లు అధికారులు అంచనా.
Comments
Please login to add a commentAdd a comment