విద్యార్థినులకు కార్పొరేట్ నైపుణ్యాలపై శిక్షణ
సాక్షి, చైన్నె : విద్యార్థులకు క్యాంపస్ టూ కార్పొరేట్ నైపుణ్యాలు పేరిట శిక్షణ అందించేందుకు ఫిక్కీ మహి ళా విభాగం నిర్ణయించింది. ఇందులో భాగంగా స్టెల్లా మెరీస్ కళాశాలకు చెందిన 1000 మంది విద్యారి్థనుల ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు సోమవారం స్థానికంగా జరిగాయి. ఈ ఒప్పందాలపై ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ చెన్నై చైర్‌పర్సన్ దివ్యఅభిషేక్ ఆ కళాశాల ప్రిన్సిపల్ స్టెల్లా మెరీ, తమిళనాడు టెక్నాలజీ హబ్ సీఈఓ వనిత వేణుగోపాల్‌లు సంతకాలు చేశా రు.
విద్యారిి నైపుణ్యాల అభివృద్ధి, ధ్రువీకరణ కోర్సులతో క్యాంపస్ టూ కార్పొరేట్ ప్రోగ్రామ్‌ను ఆరు నెలల వ్యవధితో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దివ్య అభిషేక్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈప్రయత్నం చేపట్టామన్నారు. మహిళ నాయకత్వం పెరగాలని, బాధ్యతాయుతమైన వ్యాపార వేత్తలు గా, సంస్థలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగాలన్న కాంక్షతో ముందుకెళ్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment