తిరుక్కురల్ చిత్రంలో నటి ధనలక్ష్మి
తమిళసినిమా: తిరువళ్లువర్ సామాజిక అంశాలతో రాసిన ప్రముఖ గ్రంథం తిరుక్కురల్. ఇది వాసికెక్కిన తమిళుల ప్రాచీన గ్రంథం. అలాంటి తిరుక్కురల్ ఇప్పుడు సినిమాగా తెరకెక్కుతోంది. ఇంతకు ముందు దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ జీవిత చరిత్రను కామరాజ్ పేరుతో రూపొందించిన రమణా కమ్యునికేషన్స్ అధినేత ఏజే.బాలకృష్ణన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందించడంతో పాటు రెండు పాటలను రాయడం విశేషం. కాగా ఇందులో వళ్లువర్‌గా కలైచోళన్, వాసూకిగా నటి ధనలక్ష్మి నటిస్తుండగా, పాండియన్ రాజాగా ఓఏకే సుందర్, నక్కీరర్‌గా దర్శకుడు సుబ్రమణియ శివ, పుల్వర్ పెరుంతలైచందన్‌గా కొట్టాచ్చి నటిస్తున్నారు.
వీరితో పాటు గుణబాబు, పాటినికుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సెంబూర్ కె.జయరాజ్ కథ, కథనం, సంభాషణలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎడ్విన్ సహాయ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా తిరుక్కురల్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment