హీరోయిన్‌లను ఎంపిక చేసేది వీరే..
తమిళసినిమా: శ్ఙ్రీరాజకీయ రంగ ప్రవేశం చేసిన పురిటీలోనే నటుడు విజయ్‌పై విమర్శల దాడి చేస్తున్నారు. ముందు ఆయన్ని రాజకీయాలు చేయనివ్వండి ఆ తర్వాత విమర్శించండి శ్ఙ్రీఅని దర్శకుడు, సినీ దర్శక సంఘం అధ్యక్షుడు ఆర్‌వి.ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. సిగర్ పిక్చర్స్ పోతాకంపై కమల కుమారి, రాజ్ కుమార్ కలిసి నిర్మించిన చిత్రం ఎక్స్ ట్రీమ్. రాజ వేర్ కష్ణ దర్శకత్వం వహించిన ఇందులో నటి రక్షిత మహాలక్ష్మి, అబి నక్షత్ర, రాజ్ కుమార్,ఆనంద్ నాగ్ ,అమృత షెల్టర్, శివం తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రతాప్ సంగీతాన్ని డీజే బాల ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమం పూర్తిచేసుకుని ఈనెల 20న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్ర హిట్టు సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద ల్యాబ్లో ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్‌వీ ఉదయ్ కుమార్, కార్యదర్శి పేరరసు, నటుడు, డిస్ట్రిబ్యూటర్ల సంఘం అధ్యక్షుడు కె. రాజన్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఆడియోను ఆవిష్కరించారు. ఇతని నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ శ్ఙ్రీదర్శకుడు రాజా వేల్ మొదట ఒక కథ చెప్పినప్పుడు దాన్ని షార్ట్ ఫిలింగా రూపొందించాం. అది పలు అంతర్జాతీయ అవార్డులను తెచ్చిపెట్టడంతో పాటు అందులో నటించిన నా నటనకు అభినందనలు లభించాయి. అదే షార్ట్ ఫిలింను తూవల్ పేరుతో చిత్రంగా రూపొందించి ఇటీవల విడుదల చేయగా పలువురి ప్రశంసలు లభించాయి.. ఆ తర్వాత మహిళల దక్షిణ ఇతివృత్తంతో కూడిన ఈ ఎక్స్‌ట్రీమ్ చిత్రాన్ని నిర్మించాం.. ఇందులోనూ దర్శకుడు నన్ను పోలీసు అధికారిగా నటింపజేశారుశ్రీశ్రీ అని చెప్పారు..
దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్ వి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ భర్త రాజ్‌కుమార్ ఆశకు బలాన్నిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించిన కమల కుమారికి అభినందిస్తున్నాను. ఇప్పుడు బయట వారు సినిమా వాళ్లను విమర్శిస్తున్నారు. అయితే బయట ప్రపంచంలో చాలామంది చెడ్డవాళ్ళు ఉన్నారు. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వస్తే తప్పేంటి. నటుడు విజయ్ ఇప్పుడే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆయన పై ఆదిలోనే విమర్శల దాడి చేస్తున్నారు. విజయ్ రాజకీయాలు చేసిన తర్వాత విమర్శించండి. సినిమా రంగం నుంచి చాలామంది ముఖ్యమంత్రులు అయ్యారు.. కాబట్టి ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చు.. అని దర్శకుడు ఆర్‌వీ ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment