నటి తాప్సీ
తమిళసినిమా: సినీరంగంలో కథానాయికలు ఒక స్థాయికి ఎదిగిన తరువాత కచ్చితంగా వారి వాయిస్ రైజ్ అవుతుంది. అలాంటి వారిలో నటి తాప్సీ ఒకరు. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటి స్తూ అగ్ర కథానాయకి స్థాయికి ఎదిగిన ఈ ఉత్తరాది భామ కోలీవుడ్‌లో ధనుష్ కు జంటగా ఆడుగళం చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఇక్కడ తొలి చిత్రమే సూపర్ హిట్ కావడం, నటుడు ధనుష్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తెచ్చి పెడటంతో తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అయితే చాలా తక్కువ చిత్రాల్లోనే ఇక్కడ నటించారు. అయితే తెలుగులో చాలా చిత్రాలు చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ పై దృష్టి సారించారు. ఇక్కడ ఈమె నటించిన బేబీ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. వరుసగా అవకాశాలు వరించాయి.
ఇలా తాప్సీ నటించిన చిత్రాలలో పింక్ ఒకటి. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. హలో బాలీవుడ్ టాప్ స్టార్ షారుక్ ఖాన్ వరకు పలువురు హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. అదేవిధంగా ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాల్లోనూ నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కాగా గత మార్చి 24న బాయ్ ఫ్రెండ్ మాథ్యూస్ బో అనే డెన్మార్క్‌కు చెందిన టెన్నిస్ ప్లేయర్ కోచ్‌ను పెళ్లి చేసుకున్నారు. అలాంటి తాప్సీ ఇటీవల ఓ భేటీలో చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్రాల్లో హీరోయిన్లు ఎంపిక చేసేది హీరోలే అని పేర్కొన్నారు. అదేవిధంగా హీరోలు తమకంటే తక్కువ స్థాయిలో ఉన్న హీరోయిన్లకే అవకాశా లు ఇస్తారన్నారు. ఇలా తాప్సీ తనకు ఎదురైన అనుభవాలను పేర్కొన్నారు. కాగా కెరీర్ ఆరంభంలో అయితే ఇలాంటివి మాట్లాడేవారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment