పొన్పాడి చెక్‌పోస్టు వద్ద బస్సుల్లో పోలీసులు తనిఖీ
ముగ్గురి అరెస్టు
తిరుత్తణి: ఆంధ్రా నుంచి బస్సుల్లో తరలించిన 25 కేజీల గంజాయి స్వాదీనం చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. వివరాలు.. తిరుత్తణి సమీపంలోని పొన్పాడి చెక్‌పోస్టు వద్ద పోలీసులు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆంధ్రాలోని తిరుపతి నుంచి చెన్నై, కాంచీపురం, తిరుత్తణి ప్రాంతాలకు పయనించిన బస్సుల్లో తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా బస్సులో వుంచి తరలించిన 25 కేజీల గంజాయిని గుర్తించి సీజ్ చేశారు.
విచారణలో కాంచీపురం జిల్లా చిరువానూరుకు చెందిన దినేష్(21), ప్రతాప్‌కుమార్(21), విజయ్(18) ఆంధ్రాలో గంజాలు కొనుగోలు చేసి కాంచీపురం తరలించినట్లు గుర్తించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అలాగే ప్రభుత్వ బస్సులో తరలించిన 6 కేజీల గుట్కా ప్యాకెట్లు స్వాదీనం చేసుకున్న తిరుత్తణి పోలీసులు చిత్తూరు జిల్లా నగరి సమీపం ఓజుకుప్పానికి చెందిన తరుణ్(18) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment