
చైన్నె వేదికగా టీఎన్‌పీపీఎల్!
సాక్షి, చైన్నె : ఎంజీఎం తమిళనాడు పికిల్‌బాల్ ప్రీమియర్ లీగ్ (టీఎన్‌పీపీఎల్) చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియం వేదికగా శనివారం ప్రారంభమైంది. దక్షిణ భారతదేశంలో పికిల్‌బాల్ పోటీలను ప్రోత్సహించేలా జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ సీఈఓ, సభ్య కార్యదర్శి జె మేఘనాథ్ రెడ్డి, అవార్జున, ఖేల్‌రత్న అవార్డు గ్రహీత శరత్ కమల్, నటుడు సతీష్ ముత్తుకృష్ణన్ పాల్గొని ఈ పోటీలను ప్రారంభించారు. మేఘనాథ్ రెడ్డి మట్లాడుతూ ‘పికిల్ బాల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడ అని, ఎంజీఎం ఈ పోటీలను ఏర్పాటు చేసి క్రీడాకారులలోని ప్రతిభను వెలికి తీసే ప్రయత్నం చేయడం అభినందనీయమని కొనియాడారు. జాతీయ అంతర్జాతీయ పికిల్ బాల్ ఈవెంట్లలో తమిళనాడు బలమైన పోటీదారుగా ఎదగడం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఇలాంటి పోటీలు భారతదేశంలో క్రీడల ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనం అని టేబుల్ టెన్నిస్ లెజెండ్ శరత్ కమల్ ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం కూడా జరిగే పోటీలలో 16 జట్లు పాల్గొంటున్నాయి. ప్రతి జట్టులోనూ పది మంది క్రీడాకారులు ఉంటారని టీఎన్‌పీపీఎల్ కార్యదర్శి కె. మోహిత్ కుమార్ తెలిపారు.
ఏఐ ఆవిష్కరణలు
ప్రోత్సహించడమే లక్ష్యం
సాక్షి, చైన్నె : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ప్రోత్సహించడం లక్ష్యంగా ఆరుపడై వీడు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , వినాయక మిషన్ పరిశోధన సంస్థ కంప్యూటర్ సైన్‌న్స్, ఇంజినీరింగ్ విభాగంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు. చైన్నె పనయూరు క్యాంప్‌లో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ ఏఐ పేరిట ఏవీఐటీ ఏఐ నెక్సస్ క్లబ్‌గా ఈ వేదికను నెలకొల్పారు. ప్రొఫెసర్ బాలకృష్ణన్ మాట్లాడుతూ ఏఐతో సమస్యల పరిష్కారం, వర్క్ షాపులు, ఆవిష్కరణలు, సహకారం లక్ష్యంగా ఈ క్లబ్ పనిచేస్తుందన్నారు. ఏవీఐటీ ప్రిన్సిపల్ జి సెల్వకుమార్ మాట్లాడుతూ విద్యారంగంలో ఏఐ ఆధారిత చొరవకు ప్రాముఖ్యతను కల్పించేందుకు ఈ వేదిక కీలకం కానున్నదన్నారు. డాక్టర్ పార్తీబన్ శ్రీనివాసన్ తన ప్రసంగంలో కృత్రిమ మేధస్సు రంగంలో భవిష్యత్ మార్గదర్శకులను పెంపొందించడం లక్ష్యంగా చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు.
మార్చి 6 నుంచి
’సెట్’ పరీక్షలు
కొరుక్కుపేట: యూనివర్సిటీలు, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు యూజీసీ నెట్ పరీక్షను నిర్వహిస్తుంది. అదేవిధంగా సెట్ పరీక్షను ఆయా రాష్ట్రాలు నిర్వహిస్తాయి. తమిళనాడు రాష్ట్ర విశ్వవిద్యాలయాలు రొటేషన్ పద్ధతిలో సెట్ పరీక్షను నిర్వహిస్తున్నాయి. దీని ప్రకారం, 2024 నుంచి 3 సంవత్సరాల పాటూ సెట్ పరీక్షను నిర్వహించడానికి తిరునల్వేలి మనోన్మానియం విశ్వవిద్యాలయానికి అనుమతి మంజూరైంది. అయితే పరీక్షకు ముందు సాంకేతిక లోపం తలెత్తడంతో పరీక్ష వాయిదా పడింది. దీని తర్వాత టీచర్ ఎగ్జామినేషన్ బోర్డు సెట్ పరీక్షను నిర్వహిస్తుందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు ఉపాధ్యాయ ఎంపిక బోర్డు విడుదల చేసిన పత్రికా ప్రకటన విడుదల చేసింది. అందులో.. తిరునెల్వేలి మనోన్మణియం సుందరనార్ విశ్వవిద్యాలయం 2024 సంవత్సరానికి రాష్ట్రస్థాయి అర్హత పరీక్ష (సెట్)ని ప్రకటించింది. దీనికి సంబంధించిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరించారు. ఈక్రమంలోనే సెట్ అర్హత పరీక్షను ఉపాధ్యాయ ఎంపిక బోర్డు నిర్వహించాలని ఉన్నత విద్యాశాఖ గతేడాది డిసెంబర్ 17న ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం యూజీసీ నిబంధనల, మార్గదర్శకాల ప్రకారం సెట్ అర్హత మార్చి 7, 8, 9 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ పరీక్ష తేదీకి 7 రోజుల ముందు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని, అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. అడ్మిట్ కార్డ్ అభ్యర్థులకు విడిగా పంపించబోమని స్పష్టం చేశారు.

చైన్నె వేదికగా టీఎన్‌పీపీఎల్!

చైన్నె వేదికగా టీఎన్‌పీపీఎల్!
Comments
Please login to add a commentAdd a comment