యాక్షన్ థ్రిల్లర్‌గా డెక్ట్సర్
తమిళసినిమా: సినిమా భాషా పరిధులు దాటి చాలా కాలమైంది. ఇప్పుడు పాన్ ఇండియా, పాన్ వరల్డ్ చిత్రాల వరకు వెళ్లిపోయింది. అలా పాన్ సౌత్ స్థాయి చిత్రంగా రూపొందిన చిత్రం డెక్ట్సర్. రామ్ ఎంటర్‌టైనర్స్ పతాకంపై ఎస్‌వీ ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి సూర్యన్.జి దర్శకత్వం వహించారు. రాజీవ్ గోవింద్, అభిషేక్ జార్జ్ హీరోలుగా నటించిన ఇందులో యుక్తపెర్వి, సితార విజయన్ హీరోయిన్‌గా నటించారు. నటుడు హరీష్ పేరడీ విలన్‌గా నటించిన ఇందులో అష్రఫ్ గురుకల్, శోభ, ప్రియా ముఖ్యపాత్రలు పోషించారు. ఆదిత్య గోవిందరాజ్ చాయాగ్రహణం, శ్రీనాథ్ విజయ్ సంగీతాన్ని అందించిన చిత్రం ఈ నెలాఖరున తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈసందర్భంగా సోమవారం సాయంత్రం చిత్ర ట్రైలర్ కార్యక్రమాన్ని చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఆర్వీ.ఉదయ్‌కుమార్, కార్యదర్శి పేరరసు, డిస్ట్రిబ్యూటర్స్ సంఘం అధ్యక్షుడు, నటుడు కె.రాజన్, నటి వనితా విజయకుమార్ ముఖ్యఅతిథులుగా పాల్గొని చిత్ర ట్రైలర్లు ఆవిష్కరించారు. దర్శకుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ డెక్ట్సర్ చిత్రానికి తమిళ దర్శకుడు ,కన్నడ నిర్మాత, మలయాళ నటీనటులు, తెలుగు నత్య దర్శకురాలు అంటూ దక్షిణాదికి చెందిన కళాకారులు కలిసి పనిచేయడం వల్ల ఇది పాన్ సౌత్ కథా చిత్రంగా మారిందన్నారు. అదేవిధంగా ఈ చిత్రంలోని ఒక పాట కురక్రారును కిక్కు ఎక్కించే విధంగా చాలా గ్లామర్‌గా చిత్రీకరించినట్లు చెప్పారు. అదే సమయంలో ఎక్కడా అశ్లీలం లేకుండా ముద్దు సన్నివేశాలు చోటుచేసుకున్నాయన్నారు. చిత్రాన్ని దర్శకుడు అన్ని వర్గాలను అలరించే విధంగా కమర్షియల్ అంశాలతో రూపొందించినట్లు పేర్కొన్నారు. మంచి యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన చిత్రం డెక్ట్సర్ మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని ఉదయ్‌కుమార్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment