కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

కుమార్తెను గర్భవతిని చేసిన తండ్రి అరెస్టు

Published Sun, Feb 16 2025 1:42 AM | Last Updated on Sun, Feb 16 2025 1:42 AM

-

సేలం: కన్న కుమార్తైపె లైంగిక దాడికి పాల్పడిన గర్భవతిని చేసిన కామాంధుడైన తండ్రిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. వివరాలు.. మూలైక్కరైపట్టి సమీపంలో ఉన్న ఒక గ్రామానికి చెందిన కూలి కార్మికుడు. ఇతని కుమార్తె ఆ ప్రాంతంలో 8వ తరగతి చదువుతోంది. ఇటీవల ఆ బాలికకు అనారోగ్యం ఏర్పడడంతో ఆస్పత్రిలో చికిత్స చేయించగా గర్భంతో ఉన్నట్టు తెలిసింది. తల్లి విచారించగా కన్న తండ్రే ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టు తెలిసింది. ఈ స్థితిలో తన కుమార్తైపె తండ్రి లైంగిక దాడికి పాల్పడి గర్భవతిని చేసినట్టు నాంగునేరి మహిళా పోలీసు స్టేషన్‌లో చిన్నారి తల్లి ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బాలిక తండ్రిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement