ముగిసిన బ్రిడ్జ్ నేషనల్ పోటీలు
సాక్షి, చైన్నె: జాతీయ, ప్రపంచ స్థాయిలో బ్రిడ్జిని ప్రోత్సహించడానికి ఎక్స్‌ప్రెస్ అవెన్యూ గత వారం రోజులుగా బ్రిడ్జ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తమిళనాడు బ్రిడ్జ్ అసోసియేషన్ సహకారంతో తొలి నేషనల్ బ్రిడ్జ్ చాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఇండియన్ బ్రిడ్జ్ చరిత్రలో ఒక మాల్ బహిరంగ వేదికగా టోర్నమెంట్ నిర్వహించడం ఇదే తొలి సారి కావడం గమనార్హం. ఎక్స్‌ప్రెస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ కవితా సింఘానియా ఈ పోటీలను ప్రోత్సహించే విధంగా సహకారం అందించారు. ఈఏ బ్రిడ్జ్ అంతర్జాతీయ చాంపియన్ షిప్ పోటీలను సెప్టెంబరు –2025లో నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా జరిగిన పోటీలలో నేషనల్ ఉమెన్ చాపియన్లుగా విద్యా పటేల్, కల్పనా గుర్జార్ నిలిచారు. విజయజాజూ మెమోరియల్ నేషనల్ మిక్స్‌డ్ పెయిర్స్ చాంపియన్ షిప్‌లో విజేతలు సందీప్ ఎన్ కర్మాకర్, మరియాన్నే కర్మాకర్‌లు గెలిచారు. తోలాని ఆలిండియా ఓపెన్ నేషనల్ మాస్టర్స్ బ్రిడ్జ్ చాంపియన్ షిప్‌లో విజేతలుగా టీం సర్లా ఫైబర్స్ నిలవగా, పెయిర్స్ ఈవెంట్ విజేతలుగా అరవింద్ వైద్య, శుభం ఆచార్య నిలబడ్డారు. విజేతలకు రూ.5 లక్షలు విలువగల బహుమతులను సోమవారం అందజేశారు. బీఎఫ్‌ఐ అధ్యక్షుడు ప్రసాద్ కేని పోటీలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment