సాక్షి, చైన్నె: చైన్నెలోని ఎస్‌ఆర్‌ఎం ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వినూత్నమైన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇది తదుపరి తరం ప్రజారోగ్యం లక్ష్యంగా స్థానిక ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతూ రూపొందించారు. రూపొందించబడింది. ఈ వివరాలను సోమవారం ప్రకటించారు. ఈ మేరకు 60 శాతం మార్కులతో ప్లస్ టూ పూర్తిచేసిన విద్యార్థులు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు అని తెలిపారు. ప్రపంచ, స్థానిక ఆరోగ్య సమస్యలను సమగ్ర పరిచే బలమైన పాఠ్యాంశాలను ఈ ప్రోగ్రామ్ కలిగి ఉంటుందన్నారు. ఎపిడెమియాలజీ, బయోస్టాటిస్టిక్స్, ఆరోగ్య వ్యవస్థలు, విధానం, ఆరోగ్య ప్రాజెక్ట్ నిర్వహణ, ఆరోగ్య పరిశోధనలు ఈ ప్రోగ్రామ్‌లో ఉంటాయని వివరించారు. గ్రాడ్యుయేట్లు జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు, పరిశోధనా సంస్థలు, సీఎస్‌ఆర్, కన్సల్టింగ్ సంస్థలు, ఐటీ కంపెనీలు, ఆరోగ్య బీమా కంపెనీలు, ఫార్మా, క్లినికల్ పరిశోధన సంస్థలు, ప్రభుత్వ ఆరోగ్య విభాగాలు, విద్యాసంస్థలలో విభిన్న కెరీర్‌లను కొనసాగించడానికి ఈ ప్రోగ్రామ్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్లు, రీసెర్చ్ ఆఫీసర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు లేదా డాక్టోరల్ అధ్యయనాలను కొనసాగించవచ్చునని పేర్కొన్నారు. వినూత్న విద్య, అనుభవజ్ఞులైన అధ్యాపకులు , అత్యాధునిక సౌకర్యాలతో నిబద్ధత, వాస్తవ ప్రపంచ ప్రభావాన్ని చూపాలన్న ఆసక్తి, ప్రజారోగ్యంపై దృష్టి సారించే విధంగా చేపట్టిన ఈ ప్రోగ్రామ్‌లో చేరదలచిన వారు www.rrmirt.edu.in వెబ్ సైట్‌ను సందర్శించి వివరాలను తెలుసుకోవచ్చునని, దరఖాస్తులు చేసుకోవచ్చునని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment