వా వాద్ధియార్ ఫస్ట్ సింగిల్ లిరిక్ విడుదల
తమిళసినిమా: నటుడు కార్తీ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రాలలో వాద్ధియార్ ఒకటి. నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు సత్యరాజ్, రాజ్ కిరణ్, జిఎం సుందర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ నారాయణ సంగీతాన్ని జార్జ్ విలియమ్స్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. కాగా చిత్ర టీజర్‌ను ఇటీవల విడుదల చేయగా 6 మిలియన్లకు పైగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డు సృష్టించిందని చిత్రవర్గాలు పేర్కొన్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలోని సింగిల్ లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. ఈయిర్ పత్తికామ్ అని పల్లవితో సాగే ఈ పాటను గీత రచయిత వివేక్ రాయగా గాయనీగాయకులు విజయ నారాయణన్, ఆదిత్య రవిచంద్రన్‌తో కలిసి సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ పాడారు. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సినీ సంగీత ప్రియులను విపరీతంగా అలరిస్తోందని నిర్మాతల వర్గం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో వా వాద్ధియార్ చిత్రంపై కార్తి అభిమానుల్లో ఫుల్ జోష్ కలుగుతోంది. కాగా నటి కృతిశెట్టి కథానాయకిగా తమిళంలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. దీంతో ఈ చిత్రం విజయం ఆమె కెరీర్ కు చాలా అవసరం అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే వెలుపడే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment