డీఎంకే ప్రభుత్వంలోనే కంటి ఆసుపత్రులకు అధిక ప్రాధాన్యత
వేలూరు: డీఎంకే ప్రభుత్వంలోనే రాష్ట్రంలో కంటి ఆసుపత్రిలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే కార్తికేయన్ అన్నారు. వేలూరు అన్నారోడ్డులో అధునూతన పద్ధతిలో నిర్మించిన వాసన్ ఐ కేర్ ఆసుపత్రిని రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కే కమల్‌బాబు అధ్యక్షతన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం రోగులకు అవసరమైన అన్ని వసతులు ఉన్నాయా అనే వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేలూరు పట్టణంలో కార్పొరేట్ కంటి ఆసుపత్రిని ప్రారంభించడం అభినందనీయమన్నారు. అదే తరహాలో ఆసుపత్రి నిర్వహకులు నిరుపేదల, కొండ వాసులకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిరుపేద ప్రాంతాలను గుర్తించి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి వారికి సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మానవునికి రెండు కల్లు అవసరమని ప్రతి ఒక్కరూ కంటికి వైద్య పరీక్షలు చేసుకోవడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో వేలూరు మేయర్ సుజాత, తమిళనాడు ప్రాథమిక పాఠశాలల రిటైర్ట్ టీచర్‌ల సంఘం జిల్లా అద్యక్షులు జ్యోతి అప్పన్‌తో పాటూ వాసన్ ఐ కేర్ ఆసుపత్రి డాక్టర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment