ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రచారం
సాక్షి, చైన్నె: పర్యావరణ అనుకూల జీవనాన్ని ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా చైన్నె లోని గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ విద్యార్థుల బృందం గురువారం తిరుక్కళి కుండ్రం గ్రామ వీధులలో పరి శుభ్రమైన, పచ్చని వాతావరణం గురించి అవగాహనప్రచారం నిర్వహించారు. తిరుకళి కుండ్రం మునిసిపాలిటీ సహకారంతో, కర్మ యోగా సంస్థ చొరవతో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్‌కు బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాల వాడకాన్ని ప్రో త్సహించడం, ప్లాస్టిక్ కాలుష్యం, హానికరమైన ప్ర భావాల గురించి అవగాహన పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్లారు. కర్మ యోగ సంస్థ విభాగాధిపతి ప్రొఫెసర్ అరుల్ స్వామి నేతృత్వంలో వి ద్యార్థులు వీధివీధిన ప్రచారం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రేట్ లేక్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ డీన్ డాక్టర్ సురేష్ రామనాథన్, తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ డిప్యూటీ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ ఉదయకుమార్, అసిస్టెంట్ డైరెక్టర్ బాలాజీ, తిరుక్కళికుండ్రం మునిసిపాలిటీ చైర్మన్ యువరాజ్, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ లత, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విశ్వనాథన్, కర్మయోగా సంస్థ ప్రతినిధి ఎడ్వర్డ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.