
పా.రంజిత్ దర్వకత్వంలో..
తమిళసినిమా: దర్శకుడు పా.రంజిత్ కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల నుంచి సర్‌పట్టా పరంపరై, తంగలాన్ వంట్టి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. ఈయన ఇటీవల తెరకెక్కించిన చిత్రం తంగలాన్. నటుడు విక్రమ్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్‌ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సర్‌పట్టా పరంపరై – 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫాహత్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత దూళిపాల నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.
దర్శకుడు
పా.రంజిత్