
టోల్ వడ్డన ఆరంభం
●5 నుంచి 10 శాతం వరకు పెంపు
సేలం: రాష్ట్రవ్యాప్తంగా 40 టోల్‌గేట్‌లలో సోమవారం అర్ధరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ పెంపు అమలు ప్రారంభమైంది. తద్వారా వాహన చోదకుల వద్ద 5 నుంచి 10 శాతం వరకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న టోల్‌గేట్‌లలో ఏడాదికి ఒకసారి, రెండు విడతలుగా టోల్ ట్యాక్స్ పెంచి వసూలు చేస్తున్నారు. ఈక్రమంలో రాష్ట్రంలో మొత్తం ఉన్న 78 టోల్ గేట్‌లలో తొలి విడతగా 40 టోల్ గేట్‌లలో సోమవారం అర్థరాత్రి నుంచి టోల్ ట్యాక్స్ ఛార్జీలు పెంచుతూ జాతీయ హైవే కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ టోల్ గేట్‌లలో 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచారు.
చైన్నె పరిధిలో..
ఈ క్రమంలో చైన్నె పరిధిలో ఉన్న ఈసీఆర్ (ఈస్ట్ కోస్ట్ రోడ్డు)లో ఉత్తండి, చైన్నె ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న వరదరాజపురం, కొరప్పంజేరి, పళవేడు, చిన్న ముల్‌లైవాయల్ ప్రాంతాలలో ఉన్న టోల్ గేట్‌లలో ఛార్జీలను పెంచారు.