
హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
సేలం: తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలో పెట్రోల్ బంకు మేనేజర్ హత్య కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. కయత్తారు సమీపంలో కాప్పులింగపట్టికి చెందిన సెల్వయా కుమారుడు శంకరలింగ పాండి (29). కడంపూర్‌లో ఉన్న పెట్రోల్ బంకు మేనేజర్. ఈ స్థితిలో ఇతను సోమవారం ఉదయం కడంపూర్‌కు బైక్‌లో వెళ్లాడు. 11 గంటల సమయంలో చత్రపట్టి సమీపంలో వెళుతుండగా ఎదురుగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో శంకరలింగ పాండి గాయపడ్డాడు. ఇది చూసి కారులో నుంచి దిగిన ముఠా కత్తులతో శంకరలింగపాండిని నరికి హతమార్చారు. తర్వాత ఈ హత్యను ప్రమాదంగా నమ్మించారు. సమాచారం అందుకున్న కయత్తారు పోలీసులు శవపంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బైక్‌ను ఢీకొన్న కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మహిళ విషయంగా అతన్ని హత్య చేసటినట్లు తెలిసింది. శంకరలింగ పాండిని హత్య చేసిన అదే ప్రాంతానికి చెందిన షణ్ముగరాజ్, స్నేహితుడు మహారాజన్‌ను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వీరిలో షణ్ముగరాజ్ భార్య కొన్ని నెలల క్రితం ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. ఈక్రమంలో పాత కక్షల కారణంగానే శంకరలింగపాండిని హత్య చేసినట్టు తెలిసింది.

హత్య కేసులో ఇద్దరి అరెస్ట్