
లవ్ మ్యారేజ్ ఫస్ట్‌లుక్ విడుదల
తమిళసినిమా: విక్రమ్‌ప్రభు నటుడిగా తన స్థాయిని విస్తరించుకుంటున్నారు. కోలీవుడ్‌లో కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన తాజాగా అనుష్క కథానాయకిగా నటిస్తున్న తాజా చిత్రం ఘాటీ ద్వారా విక్రమ్‌ప్రభు టాలీవుడ్ లోకి నేరుగా అడుగు పెట్టారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా విక్రమ్ ప్రభు తాజాగా నటిస్తున్న తమిళ చిత్రం లవ్ మ్యారేజ్. సుష్మిత బట్, మీనాక్షి దినేష్, రమేష్ తిలక్, అరుళ్ దాస్, గజరాజ, మురుగానందం, కోడింగ్ వడివేలు ముఖ్యపాత్రలు పోషించారు. వీరితో పాటు సత్యరాజ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ద్వారా షణ్ముగప్రియన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ వినోదాత్మక కుటుంబ కథా చిత్రాన్ని అష్యూర్ ఫిలిమ్స్, రైజ్ ఈస్ట్ ఎంటర్‌టెయిన్‌మెంట్ సంస్థల అధినేతలు డా.శ్వేతాశ్రీ, శ్రీనిధి సాగర్ కలిసి నిర్మించారు. చిత్రానికి శ్యాన్ రోల్డన్ సంగీతాన్ని అందించడంతో పాటు ఒక పాటను రాసి పాడారు. ఈ చిత్రం,నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న సమ్మర్ స్పెషల్ తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఐందులో సంగీతదర్శకుడు శ్యాన్‌రోల్డన్ రాసి, పాడి, నటించిన కల్యాణం కలవరం అనే పాటను, చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. ఈ పాటకు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిందనే ఆనందాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తం చేశారు.
లవ్ మ్యారేజ్ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్