
ఎస్‌ఆర్‌ఈఎస్ ఉగాది వేడుకలు
కొరుక్కుపేట: సదరన్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ (ఎస్‌ఆర్‌ఈఎస్) ఆధ్వర్యంలో విశ్వావసు నామ ఉగాది వేడుకలు శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. చైన్నె పెరంబూర్‌లోని సంఘ్ ప్రధాన కార్యాలయంలోని యూనిట్ హౌస్ వేదికై ంది. వేడుకల్లో సంఘ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎస్‌ఆర్‌ఈఎస్ కన్‌స్ట్రక్షన్ బ్రాంచ్ చైర్మన్ ఎస్ అమత్ కుమార్‌తోపాటు ఎం.సూర్యప్రకాష్ పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకలకు రైల్వే అధికారులు కె.నాగరాజు, ఎం.విజయ్‌కుమార్, వి.విభూషన్, వి.మురళీకృష్ణ పాల్గొని 50 మంది సభ్యులను జ్ఞాపికలతో సత్కరించారు. ఎస్‌ఆర్‌ఈఎస్ ప్రధాన కార్యదర్శి వి.గోపాలకృష్ణ, కార్యదర్శి ఓయూవీ శర్మ పాల్గొన్నారు.