
ఒలింపిక్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్
సాక్షి, చైన్నె : చైన్నె నెహ్రూ స్టేడియంలోని ఒలింపిక్ అకాడమీలో స్పోర్ట్స్ సైన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. దీనిని శుక్రవారం క్రీడల మంత్రి, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించారు. తేని, రామనాతపురంలో నిర్మించిన స్టేడియంలను క్రీడాకారులకు అంకితం చేశారు. చైన్నెలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఒలింపిక్ అకాడమీ క్యాంపస్ ఉన్న విషయం తెలిసిందే. ఇందులోని మూడవ అంతస్తులో రూ.3కోట్లతో సైన్స్ సెంటర్‌ను ఏర్పా టు చేశారు. అథ్లెట్లను శారీరకంగా మానసికంగా, దృఢంగా ఉంచడానికి. బలోపేతం చేయడానికి తీసుకుంటున్న చర్యలలో భాగంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సైన్స్ సెంటర్‌లో అథ్లెట్ల పనితీరు, ఫిట్‌నెస్, శారీరక దృఢత్వం, ఆరోగ్యం, క్రీడా వైద్యం వాటికి ప్రాముఖ్యతను ఇవ్వనున్నారు. ఈ కేంద్రంలో ఒక మానసిక ఆరోగ్య నిపుణుడు, పోష కాహార నిపుణుడు ఉన్నారు. అలాగే, తేని జిల్లా పెరియకుళం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి రూ. 5.95 కోట్లతో నిర్మించిన జిల్లా క్రీడా సముదాయంగా ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సర్జికల్ ఇంటర్వెన్షన్‌కు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మల్టీ–విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ చైర్, డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ వైద్య, మల్టీ విసెరల్ అండ్ అబ్డామినల్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ సెంథిల్ ముత్తురామన్, సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శివకుమార్ మహాలింగం, హెల్త్‌కేర్‌లో మల్టీ విసెరల్ ట్రాన్‌న్స్‌ప్లాంట్ ప్రోగ్రామ్ కన్సల్టెంట్ డాక్టర్ వెంకటేష్ నాయకత్వం వహించారు. అనస్థీషియా, ఇంటెన్సివ్ కేర్ బృందంలో డాక్టర్ దినేష్ బాబు, డాక్టర్ నివాష్ చంద్రశేఖరన్ ఉన్నారు. అలాగే, రామనాథపురం జిల్లా, పరమకుడిలో నిర్మించిన జిల్లా క్రీడా సముదాయాన్ని కూడా ఉదయనిధి స్టాలిన్ ప్రారంభించా రు. మంత్రులు పెరియస్వామి, ఆర్‌ఎస్ రాజకన్నప్పన్, పీకే శేఖర్‌బాబు, శాసనసభ సభ్యులు పరంధామన్, శరవణకుమార్, ఎస్. మురుగేశన్, యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి డాక్టర్ అతుల్య మిశ్రా, తమిళనా డు క్రీడా అభివృద్ధి అథారిటీ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, తమిళనాడు క్రీడా అభివృద్ధి కమిష న్ వైస్ చైర్మన్ డాక్టర్ అశోక్ శిఖామణి పాల్గొన్నారు.
ప్రారంభించిన మంత్రి ఉదయనిధి స్టాలిన్