కొరుక్కుపేట: విభిన్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన అసాధారణ వ్యక్తులను గుర్తించి జెప్పియార్ వర్సిటీ ఐకాన్ అవార్డులను అందిస్తూ వస్తుంది. అందులో భాగంగా 8వ ఎడిషన్‌లో సినిమా, విద్య, సాంకేతికత, క్రీడలు, పాక కళల్లో రాణిస్తున్న వారిని ఘనంగా సత్కరించుకున్నారు. జేప్పియర్ వర్సిటీ చాన్స్‌లర్ డాక్టర్ రెజీనా జె మురళి, అధ్యక్షుడు మురళి సుబ్రమణియన్ చేతుల మీదుగా ఐకాన్ అవార్డ్స్ – 2025ను అందజేశారు. ఇందులో ప్రముఖ నేపత్య గాయకులు మనో, ఆధునిక వారసత్వ ఫ్యాషన్ రూపశిల్పి జయశ్రీ రవి, ఆధునిక తమిళ సినిమా మావెరిక్ కార్తీక్ సుబ్బరాజ్, వీరితోపాటు మదన్ గౌరి, డాక్టర్ అశోక్ జి.వర్గీస్, క్రికెట్ మాస్ట్రో విజయ్ శంకర్, దక్షిణ భారత వంటకాల ప్రపంచ రాయబారి కె.టి.శ్రీనివాసరాజా, విజయ్ కరుణాకరన్ అవార్డులను అందుకున్నారు.