
ఘనంగా ఆరుద్ర పూజలు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్వామి, అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ స్వామి, అమ్మవార్లను చప్పరాలపై అధిష్టింపచేశారు. అనంతరం ఊరేగింపుగా మండలంలోని ఊరందూరు నీలకంఠేశ్వరాలయానికి వేంచేశారు. అక్కడ పూజల అనంతరం తిరిగి పానగల్, అగ్రహారం, సన్నిధివీధి, నాలుగు మాడవీధుల గుండా ఆలయానికి చేరుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

ఘనంగా ఆరుద్ర పూజలు