
అర్జున్, ఐశ్వర్య రాజేష్ జంటగా ‘తీయవర్ కులై నడుంగ’
తమిళసినిమా: యాక్షన్ కింగ్ అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం తీయవర్ కులై నడుంగ. బిగ్‌బాస్ అభిరామి, రామ్ కుమార్, జీకే రెడ్డి, లోగో, వేల రామమూర్తి, తంగదురై, ఫ్రాంక్లిన్ స్టార్ రాహుల్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సన్ మూన్ యూనివర్సల్ పిక్చర్స్ పతాకంపై డా.రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రానికి దినేష్ ఆశీవగన్ దర్శకత్వం వహించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల సిద్ధం అవుతుంది. ఈ సందర్భంగా చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్ టైనర్ కథాచిత్రంగా ఉంటుందని చెప్పారు. కాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను, సింగిల్ సాంగ్ ను విడుదల చేసినట్లు చెప్పారు. భరత్ ఆశీవగన్ సంగీత బాణీలు కట్టిన మెలోడీ సాంగ్ కు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన వస్తోందని చెప్పారు. సరవణన్ అభిమన్యు ఛాయాగ్రహణంను అందించిన ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం వివరాలను, విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు చెప్పారు.ఇది నటుడు అర్జున్, నటి ఐశ్వర్య రాజేష్‌ల కాంబోలో రూపొందిన తొలి చిత్రం అని, దీంతో చిత్రంపై మంచి అంచనాలు నెలకొన్నాయనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.