
సత్యభామలో ఘనంగా అచీవర్స్ దినోత్సవం
– 91.87 శాతం మందికి ప్లేస్‌మెంట్స్
సాక్షి, చైన్నె : సత్యభామ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో 91.87 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందజేశారు. సంవత్సరానికి గరిష్టంగా రూ.41.20 లక్షల జీతంతో విద్యార్థులను వివిధ సంస్థలు ఎంపిక చేశాయి. సత్యభామ అచీవర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025లో బెస్ట్ ప్లేస్‌మెంట్ క్యాంప్‌లో ఎంపికై న విద్యార్థులకు ఉద్యోగ నియామక ఉత్తర్వుల ప్రదానోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శనివారం రాత్రి ఈ కార్యక్రమం చైన్నెలోని ఓఎంఆర్ రోడ్డులో ఉన్న సత్యభామ డీమ్డ్ యూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగింది. ఈ విద్యాలయం చాన్స్‌లర్ డాక్టర్ మరియాజీనా జాన్సన్, అధ్యక్షురాలు డాక్టర్ మరియా జాన్సన్, ఉపాధ్యక్షులు అరుల్ సెల్వన్, మరియా బెర్నాడెట్ తమిళరసి, మరియా కేథరీన్ జయప్రియ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు ఉద్యోగ నియామక శిబిరంలో ఎంపికైన విద్యార్థులకు ఉద్యోగ ఉత్తర్వులను అందజేసి సత్కరించారు. ఉద్యోగం కోసం పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులలో 91.87 శాతం మంది అధిక జీతాలతో వివిధ రంగాలలో అవకాశాలు దక్కించుకున్నట్టు ఈసందర్బంగా ప్రకటించారు. 2025లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ప్రాసెసింగ్, అమ్మకాలు , ప్రకటనలు వంటి వివిధ రంగాల నుంచి 300 కంటే ఎక్కువ ప్రైవేట్ కంపెనీలు తమ వర్సిటీని సందర్శించాయని వివరించారు. ఈ సంవత్సరం మొత్తం 3,120 మందికి ఉద్యోగ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఈసందర్భంగా వివరించారు. సత్యభామ డీమ్డ్ విశ్వవిద్యాలయం ఉన్నత విద్య సలహా కమిటీ ద్వారా చదివిన 216 మంది విద్యార్థులు అమెరికా, లండన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్ భారతదేశం సహా విదేశాలలో ఉన్నత విద్య కోసం ఎంపిక చేసినట్టు ఈసందర్భంగా ప్రకటించారు. వివిధ కళాశాలలో చదువుకోవడానికి ఎంపికై న వారికి సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. విద్యార్థులు పొందుతున్న అత్యధిక జీతం సంవత్సరానికి 41.20 లక్షలుగా ప్రకటించారు.

సత్యభామలో ఘనంగా అచీవర్స్ దినోత్సవం