
ఇంటి పట్టాలు ఇవ్వాలని ఆందోళన
తిరువళ్లూరు: ఏళ్ల తరబడి నివాసం వుంటున్న వారికి ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ మోరై గ్రామానికి చెందిన ప్రజలు సోమవారం ఉదయం కలెక్టర్ ప్రతాప్‌కు వినతి పత్రం సమర్పించారు. వివరాలు.. తిరువల్లూరు జిల్లా ఆవడి తాలుకా మోరై గ్రామంలోని కన్నిమానగర్ సుమారు 500 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం రేషన్‌కార్డులు, ఓటరు కార్డులు, ఆధార్‌కార్డులను అందజేసింది. ప్రస్తుతం ప్రభుత్వానికి అన్ని రకాల పన్నులను చెల్లిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఇంటి పట్టాలు అందజేయాలని ఏళ్ల తరబడి కలెక్టర్‌తో సహా ఉన్నత అధికారులకు వినతి పత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి ఇంటి పట్టాలు మంజూరు చేయని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.