
అప్రకటిత కోతలపై దృష్టి సారించండి
తిరువళ్లూరు: జిల్లా వ్యాప్తంగా అప్రకటిత కోతలు, లో ఓల్టేజ్ సమస్యలపై తరచూ ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో వాటిని సరి చేయాలని విద్యుత్‌శాఖ అధికారులకు కలెక్టర్ ప్రతాప్ ఆదేశాలు జారీ చేశారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో శనివారం రాత్రి 9 గంటల వరకు జరిగింది. విద్యుత్‌శాఖ ఉన్నత అధికారులు సమావేశానికి హాజరుకాగా, కలెక్టర్ ప్రతాప్ హాజరై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్మిస్తున్న సబ్‌స్టేషన్ వివరాలు, విద్యు త్‌స్తంభాలు, ట్రాన్స్‌పార్మర్‌ల మార్పిడితో పాటూ ఇతర అంశాలపై సమిక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. సబ్‌స్టేషన్‌ల నిర్మాణపు పనులను వేగంగా పూర్తి చేసి త్వరగా అందుబాటులోకి తేవాలని, తద్వారా అప్రకటిత కోతలు, లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉందన్నారు. సమావేశంలో సీఈ శేఖర్‌తో పాటూ పలువురు పాల్గొన్నారు.