క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Sep 20 2025 6:26 AM | Updated on Sep 20 2025 6:26 AM

క్లుప్తంగా

క్లుప్తంగా

కారు దగ్ధం

తిరువొత్తియూరు: వండలూరుకు సమీపంలోని కాయరంపేడు గ్రామానికి చెందిన కణ్ణన్‌(29) 9 నెలల క్రితం ఒక మారుతి కారును కొనుగోలు చేశారు. నవాలూరులోని ఇన్ఫోసిస్‌ కంపెనీ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన తీసుకెళ్లే పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఇన్ఫోసిస్‌ కంపెనీలో పనిచేస్తున్న ఊరపాక్కం ప్రాంతానికి చెందిన ఇద్దరు ఉద్యోగులను తన కారులో ఎక్కించుకొని వండలూరు–కీలంబాక్కం రోడ్డులో డ్రైవ్‌ చేసుకుంటూ వస్తున్నాడు. ఆ సమయంలో వండలూరు జంతు ప్రదర్శనశాల సమీపంలోకి రాగానే కారు ముందు భాగం నుంచి పొగ వచ్చింది. వెంటనే, కారును పక్కకు ఆపిన కణ్ణన్‌, కారులో ఉన్న ఇద్దరు ఉద్యోగులను కిందకు దించారు. కొన్ని క్షణాల్లోనే కారుకు మంటలు వ్యాపించి, కాలిపోయింది.

రూ.40 లక్షల

బీడీ ఆకు స్వాధీనం

అన్నానగర్‌: తూత్తుక్కుడి ఉత్తర తీరంలో శుక్రవారం ఉదయం పడవ మరమ్మతుల దుకాణం వద్ద ఆగి ఉన్న అనుమానాస్పద మినీ లారీని పోలీసులు తనిఖీ చేశారు. అందులో శ్రీలంకకు అక్రమంగా తరలిస్తున్న 30 కిలోల బరువున్న బీడీ ఆకుల కట్టలు ఉన్నట్లు గుర్తించారు. పోలీసుల రాకను తెలుసుకున్న స్మగ్లర్లు అక్రమ రవాణాకు ఉపయోగించిన పడవతో పారిపోయారు. స్వాధీనం చేసుకున్న బీడీ ఆకులు దాదాపు రూ.42 లక్షలు విలువైనవని సమాచారం.

బైక్‌ను ఢీకొన్న వాహనం

– ఇద్దరు దుర్మరణం

తిరువొత్తియూరు: బైక్‌ను లగేజీ వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈఘటన ఈరోడ్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ఈరోడ్‌ జిల్లా పున్జజై పులియంపట్టి కోయంబత్తూరు మెయిన్‌ రోడ్డులోని అయ్యవు మెస్‌ సమీపంలో శుక్రవారం ఉదయం కనవుకరై ప్రాంతానికి చెందిన ఓతియప్పన్‌ (61), మారప్పన్‌ (59) అనే ఇద్దరు బైక్‌లో రోడ్డు దాటుతున్నారు. అదేసమయంలో సత్యమంగళం నుంచి కో యంబత్తూరుకు పూల లోడుతో వస్తున్న లగేజీ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకులో వెళుతున్న ఓతియప్పన్‌, మారప్పన్‌ మృతిచెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లారీ–కారు ఢీ: ఇద్దరి మృతి

అన్నానగర్‌: దిండుక్కల్‌ జిల్లా ఒట్టన్‌ చత్రం పక్కన ఉన్న చత్రపట్టి ప్రాంతానికి చెందిన పొన్‌రాజ్‌(48) బెంగళూరులో కుటుంబంతో నివశిస్తూ గృహోపకరణాలు అమ్మే ఏజెన్సీని నడిపాడు. ఇతని భార్య చిత్రకళ (33). వీరి కుమార్తె ధరణీష, కుమారుడు భవిన్‌ మిత్రన్‌(7). ఈ స్థితిలో దిండుగల్‌లో ఒక బంధువు అంత్యక్రియలకు హాజరు కావడానికి పొన్‌రాజ్‌, అతని కుటుంబం కారులో వచ్చారు. అక్కడ సంతాప సభను పూర్తి చేసుకున్న తర్వాత శుక్రవారం ధర్మపురి జిల్లా, పాలకోడ్‌ మీదుగా కారులో బెంగళూరుకు తిరిగి వెళ్లారు. కారును చిత్రకళ తమ్ముడు కార్తీక్‌(30) నడుపుతున్నాడు. తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో, పాలకోడ్‌ సమీపంలో వెళ్తుండగా, కారు ఊహించని విధంగా ముందున్న లారీని ఢీకొట్టింది. ఇందులో కార్తీక్‌, ధరణిషా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన చిత్రకళ, పొన్‌రాజ్‌, భవిన్‌ మిత్రన్‌లను రక్షించి, చికిత్స కోసం అంబులెన్స్‌లో ధర్మపురి ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.

కళలకు ప్రత్యేకం తమిళనాడు

కొరుక్కుపేట: కళలకు, పర్యాటకానికి ప్రత్యేకమైన రాష్ట్రంగా తమిళనాడు విరాజిల్లుతోందని రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి ఆర్‌ రాజేంద్రన్‌ అన్నారు. చైన్నె ట్రేడ్‌ సెంటర్‌ వేదికగా 7వ ఎడిషన్‌ సికా క్యులినరీ ఒలింపియాడ్‌– ఫుడ్‌ కాంపిటీషన్‌ 2025ను మంత్రి రాజేంద్రన్‌, చెఫ్‌ దాము, చెఫ్‌ సీతారామ్‌తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మూడు రోజులు జరగనున్న కార్యక్రమంలో భారతదేశం నుంచి 3వేల మందికి పైగా చెఫ్‌లు, అంతర్జాతీయ బృందాలు మొట్టమొదటి వాక్స్‌ ఎండాస్డ్‌ వంటల పోటీలో పాల్గొంటున్నాయి. విద్యార్థులు, చెఫ్‌ల కోసం ప్రత్యక్ష పోటీలు ఉన్నాయి. విజేతలకు బంగారు పతకాలు ప్రదానం చేస్తామని చెఫ్‌ దాము తెలిపారు.

ఏజీఐఎఫ్‌లో స్మార్ట్‌ ఫోన్లు

సాక్షి, చైన్నె: గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌(ఏజీఐఎఫ్‌)లో స్మార్‌ ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను వి స్తృతంగా కొలువుదీర్చనున్నామని అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. ఈనెల 23న ప్రైమ్‌ సభ్యులకు 24 గంటల ముందస్తు యాక్సెస్‌తో ఈ ఫెస్టివల్‌ సంబరాలు మొదలు అవుతాయని శుక్రవారం స్థానికంగా ప్రకటించారు.

యువతకు

అనుగుణంగా విక్టోరిస్‌

సాక్షి, చైన్నె: యువత ఆకాంక్షలకు అనుగుణంగా సరికొత్త విక్టోరిస్‌లో డాల్బీ అట్మాస్‌ మారుతీ సుజుకి కారు చేరిందని మారుతి సుజుకి ఇండియా సీనియర్‌ ఎగ్జిక్యూటీవ్‌ ఆఫీసర్‌ పార్థో బెనర్జీ తెలిపారు. ఈ ఎస్‌యూవీ వాహనం గురించి శుక్రవారం స్థానికంగా ఆయన వివరించారు. వినోద అనుభవాలతో కూడిన డాల్బీ ల్యాబొరేటరీస్‌, ఇంక్‌ , మారుతీ సుజుకి ఇండియాలు విక్టోరిస్‌కు డాల్బీ అట్మాస్‌లో లీనమయ్యేశక్తిని కల్పించినట్టు ప్రకటించారు. డ్రైవర్లు, ప్రయాణికులు, యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఫీచర్లను పరిచయం చేస్తున్నామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement