ఒక్కొక్కరిది ఒక్కో గాథ! | All those killed in the encounter were from poor families | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరిది ఒక్కో గాథ!

Published Wed, Dec 4 2024 4:10 AM | Last Updated on Wed, Dec 4 2024 4:10 AM

All those killed in the encounter were from poor families

అడవిబాట పట్టి అసువులు బాసిన మావోయిస్టులు

అంతా పేద గిరిజన కుటుంబాలే... 

ఏటూరునాగారం: విప్లవ సిద్ధాంతాలకు ఆకర్షితులైనవారు కొందరు. వివిధ రకాల పరిస్థితులు, వ్యక్తిగత సమస్యలు, వేధింపుల నేపథ్యంలో అడవి బాట పట్టిన వారు మరి కొందరు. ఏళ్ల తరబడి కుటుంబాలకు దూ రంగా ఉన్నారు. అకస్మాత్తుగా జరిగిన ఎన్‌ కౌంటర్‌లో అసువులు బాశారు. ఇన్నా ళ్లూ ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉన్నార్లే అను కున్న తల్లిదండ్రులు, బంధువులు.. విగత జీవులైన తమ పిల్లల్ని చూసి తల్ల డిల్లిపో యారు.

ఎన్‌కౌంటర్‌లో చనిపో యిన వారందరివీ నిరుపేద కుటుంబాలే కావడం గమ నార్హం. చెల్పాక ఎదురు కాల్పుల్లో నేలకొ రిగిన మావోయిస్టులను తీసుకెళ్లేందుకు ఏటూరునాగారం సామాజి క ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చిన ఆదివాసీలను ‘సాక్షి’ పలకరించింది.  

చిన్నతనంలోనే అడవి బాట పట్టింది
ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం పూర్వాడ తాలూకా బైరాన్‌గుట్ట గ్రామా నికి చెందిన ముసాకి జమున తండ్రి రాజు, తల్లి కొసంగి చిన్నతనంలోనే అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో పాటు గ్రామాల్లో సల్వాజుడుం, మావోయిస్టులు, పోలీసుల ఇబ్బందులు తాళలేక జమున తొమ్మిదేళ్ల వయస్సులోనే గ్రామానికి చెందిన మరి కొంతమందితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లింది. అప్పట్నుంచీ తిరిగి వచ్చింది లేదు. ఇప్పుడు శవమై కన్పించింది. – లక్ష్మణ్, జమున బాబాయి 

వాళ్ల పాటలు విని అడవిలోకి పోయిండు
మాది ఛత్తీస్‌గఢ్‌. నాకు ఇద్దరు కొడుకు లు. చిన్నోడు ముసాకి కరుణాకర్‌ అలియాస్‌ దేవల్‌ అడవిలో అప్పు డప్పుడు వినిపించే పాటలకు ఆకర్షితుడై ఐదేళ్ల క్రితం అడవి బాట పట్టిండు. వాడి చిన్నతనంలోనే నా భార్య సోడి చనిపో యింది. ఇంటి దగ్గర ఉండమంటే అన్నల్లో చేరిండు. అప్పట్నుంచి కన్పించలేదు. – ముసాకి బుజ్జ, కరుణాకర్‌ తండ్రి

22 ఏళ్ల క్రితం వెళ్లాడు
భద్రు (కుర్సం మంగు) పొలం పను లు చేసుకుంటూ ఉండేవాడు. 22 ఏళ్ల క్రితం సల్వాజుడుం కార్యక లాపాలు ముమ్మరంగా ఉన్న సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన గొడవలు, అల్లర్లతో అడవిలోకి వెళ్లి ఇక రాలేదు. అడవిలోకి వెళ్లాక జానకిని వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది.  – కుర్సం సోడి (సోమయ్య) భద్రు సోదరుడు. ఛత్తీస్‌గఢ్‌ 

గూడెంలోకి వచ్చేవారితో కలిసి వెళ్లాడు
మాది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఊసూరు తా లూకా మలంపెంట. నా భర్త చనిపోయా డు. నేను నా పెద్ద కొడుకు, చిన్నోడు కామేష్‌ కూలి పను లు చేసుకుంటూ ఉండేవాళ్లం. కామేష్‌ 14 ఏళ్ల వయస్సులో మా గూడెంలోకి వచ్చేవారితో కలిసి అడవి లోకి వెళ్లాడు. ఇప్పటికి రెండేళ్లు అవుతోంది.  – కారం ఉంగి, కామేష్‌ తల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement