చాయ్‌ చమక్‌..! | Bhavani Coffee World As Care Of For 425 Varieties Special Story | Sakshi
Sakshi News home page

చాయ్‌ చమక్‌..!

Published Fri, Jul 5 2024 8:47 AM | Last Updated on Fri, Jul 5 2024 8:47 AM

Bhavani Coffee World As Care Of For 425 Varieties Special Story

425 రకాలకు కేరాఫ్‌గా భవాని కాఫీ వరల్డ్‌

వెరై ‘టీ’, టేస్టీ కాఫీలకు అడ్రస్‌గా హట్‌–99

నగరంలో విస్తరిస్తున్న చాయ్‌ కేఫ్స్‌

అందుబాటులో రకరకాల టీలు

ఏ చాయ్‌ చటుక్కున తాగరా భాయ్‌ ఈ చాయ్‌ చమక్కులే చూడరా భాయ్‌ ఏ చాయ్‌ ఖరీదులో చీపురా భాయ్‌ ఈ చాయ్‌ ఖుషీలనే చూపురా భాయ్‌ ఏ చాయ్‌ గరీబుకు విందురా భాయ్‌ ఈ చాయ్‌ నవాబుకి బంధువే నోయ్‌ ఏ చాయ్‌ మనస్సుకీ మందురా భాయ్‌..

చంద్రబోస్‌ రాసిన ఈ పాట మనందరికీ సుపరిచితమే.. ఈ పాటలో పేర్కొన్నట్లే.. మార్కెట్‌లో అనేక రకాల టీలు అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు నగరంలో చాయ్‌ ప్రియులు కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చాయ్‌ కేఫ్‌లు కూడా భారీగా విస్తరిస్తున్నారు.

అయితే చాలాచోట్ల సాధారణ చాయ్‌ మాత్రమే అందుబాటులో ఉంటుంది. కానీ రొటీన్‌కు భిన్నంగా కొన్ని చాయ్‌ కేఫ్‌లలో పదుల సంఖ్యలో వెరైటీలను అందుబాటులో ఉంచుతున్నారు. సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని భవానీ కాఫీ వరల్డ్‌లో దాదాపు 425 రకాల చాయ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.. – చైతన్యపురి

నీరు (టీ, కాఫీ) అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిÔè Äñ ూక్తి కాదు. ఉదయం నిద్ర లేవగానే దాదాపు ప్రతి ఒక్కరూ వేడి వేడి టీ ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తుంటారు. కొందరు కాఫీ ఇష్టపడితే... మరికొందరు టీ అంటూ మంచడం మీదనుంచే కేకలు పెడుతుంటారు. అంతేకాదు.. ఇంటి నుంచి బయటకు వెళ్లి పనిచేసి అలసి పోయే వారికీ కొంచెం టీ తాగితే బాగుండనే కోరిక కలుగుతుంది. అందుకే నగరంలో అనేక చాయ్‌ స్టాళ్లు, కేఫ్‌లు నడుస్తున్నాయంటే ఆశ్చర్యపడనక్కర్లేదు.

అయితే ప్రతి చోటా మామూలుగా రొటీన్‌ టీ.. కాఫీలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతోనే సరిపెట్టుకుంటాం... అదే రకరకాల రుచులతో వివిధ రకాల కాఫీ, చాయ్‌లు అందుబాటులో ఉంటే ఎలా ఉంటదో ఒక సారి ఆలోచించండి. అలాంటి వెరైటీ కోరుకునే వారికోసమే ఈ విశేషాలు..

425 రకాల తేనీటి రుచులు.. 
దిల్‌సుఖ్‌నగర్‌ చైతన్యపురిలోని సాయినగర్‌ శివాజీచౌక్‌లో ‘భవాని కాఫీ వరల్డ్‌ హట్‌–99’ పేరుతో సమారు 425 రకాల కాఫీ, టీ, ఇతర తేయాకుతో తయారు చేసే తేనీటి రుచులు నగరవాసులను అలరిస్తున్నాయి. ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ తాగాలనుకునేలా నోరూరించే తేనీరు అందిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటూ స్థానికుల మన్ననలు ˘
అందుకుంటున్నారు.

ఫిఫ్టీ, ఫిఫ్టీ వెరైటీస్‌..
బ్లాక్‌ కాఫీలో 50 రకాలు, బ్లాక్‌టీలో 50 రకాల రుచులు, కల్చర్‌ ఆఫ్‌ ది వరల్డ్‌కు చెందిన 72 రకాల టీ, కాఫీలు తేనీటి ప్రియులకు అందిస్తున్నారు. ఇవే కాక డేవిడ్‌ ఆఫ్‌ కాఫీ, హనీ, డ్రై ఫ్రూట్, మిల్క్, హెర్బల్, హనీగ్రీన్‌ టీ, ఆమ్లా గ్రీన్‌ టీ, సొంటి, మసాలా చాయ్, షుగర్‌లెస్‌లో వివిధ రకాల టీ, కాఫీలు, క్యాపిచినో, జెమని అరోమా, స్పెషల్‌ చాయ్‌లు ఆర్డర్‌ ఇచి్చన క్షణాల్లో అందించటం వారి ప్రత్యేకత.

ఎనిమిది సంవత్సరాలుగా.. 
చైతన్యపురిలోని భవాని కాఫీ వరల్డ్‌ హట్‌–99 స్టాల్‌కు ఎనిమిది సంవత్సరాలుగా వస్తున్నాను. ఆఫీసులో విధులు ప్రారంభించే ముందు, లంచ్‌ తరువాత, సాయంత్రం ఇంటికెళ్లే ముందు ఇక్కడ టీ తాగటం అలవాటు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ రుచిలో తేడా లేదు. ఇక్కడ టీ తాగితే అదొక రిలీఫ్‌.

– ఎన్‌ పృథ్వీ, ప్రయివేటు ఉద్యోగి

ప్రపంచ ప్రసిద్ధి చెందిన రకాలు..
ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డేవిడ్‌ ఆఫ్‌ జర్మని, అరకు కాఫీ, టీలు, ఆర్గానిక్‌ ఇండియా, ట్విన్సింగ్‌ ఆఫ్‌ లండన్, శ్రీలంక దిల్మా, గ్రీస్మట్‌ హిమాలయ, జీ హైపోతో పాటు ఆరోగ్యానికి సంబందించిన హెయిర్‌ గెయిన్, స్కిన్‌ గ్లో వంటి టీ రకాలు, వెయిట్‌ లాస్‌ కిక్‌ స్టార్ట్, కూల్‌ మడౌన్, ప్రూట్‌ బూస్టర్‌ ఇలా అనేక రకాల కాఫీలు, చాయ్‌లు అందిస్తున్నామని ‘భవాని కాఫీ వరల్డ్‌ హట్‌–99’ వెంకటరమణారెడ్డి, రమాదేవి దంపతులు  

ప్రముఖులు సైతం కస్టమర్సే.. 
చైతన్యపురి ప్రాంతంలో 19 సంవత్సరాల క్రితం భవాని కాఫీ హట్‌–99 పేరుతో టీ స్టాల్‌ ప్రారంభించాం. ప్రస్తుతం నిత్యం వెయ్యి మందికి పైగా టీ, కాఫీ ప్రియులు వస్తుంటారు. వారడిగింది, వారికి ఇష్టమైంది ఏదైనా క్షణాల్లో తయారు చేసి వారికి అందిస్తామన్నారు. ప్రస్తుతం 425 రకాల టీ, కాఫీలు అందుబాటులో ఉన్నాయి. టీ కల్చర్‌ ఆఫ్‌ వరల్డ్‌కు సంబంధించిన 72 రకాల తేనీరు అందిస్తున్నాం. 

ఎక్కువగా గ్రీన్, బ్లాక్, హనీటీలతో పాటు అల్లం పుదీన, బాదం, షుగర్‌లెస్, ఇలాచి, స్పెషల్, మసాలా చాయ్‌లు తేనీటి ప్రియులు ఇష్టపడి తాగుతారు. గతంలో గాయని గీతా మాధురి, నందు దంపతులు వారానికి ఒకసారి వచ్చి టీ, కాఫీ తాగి వెళ్లేవారు. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా నగరంలోని పలు ప్రాంతాల నుంచి తేనీటి ప్రియులు ఇక్కడికి వస్తుంటారు. – వెంకటరమణారెడ్డి, నిర్వాహకులు, భవాని కాఫీ వరల్డ్‌ హట్‌–99

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement