
కొణిజర్ల మండలం పల్లిపాడులో భట్టికి స్వాగతం పలుకుతున్న మహిళలు
వైరా: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా అని, అక్కడ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఖాయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తంచేశారు. మునుగోడు ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే దానిపై పార్టీ ఎన్నికల కమిటీ పూర్తిస్థాయిలో పని చేస్తోందన్నారు. స్వతంత్ర భారత్ వజ్రోత్సవాల సందర్భంగా ‘ఆజాదీ కా గౌరవ్’ పేరుతో ఖమ్మం జిల్లాలో 75 కి.మీ. మేర భట్టి చేపట్టిన పాద యాత్ర శుక్రవారం కొణిజర్ల, వైరాల్లో కొనసాగింది.
ఈ సందర్భంగా ఆయన పలుచోట్ల ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాగా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పార్లమెంట్ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. వ్యవస్థలన్నింటినీ కబళించి దేశ ద్రోహు లను చేరదీసి ఈడీ తదితర దర్యాప్తు వ్యవస్థలను గిట్టని రాజకీయ పార్టీ నాయకులపై ప్రయోగిస్తున్నారని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించిన వారిని జైల్లో పెట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. దేశ చరి త్రను తప్పుగా చిత్రీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు బాధ కలిగి స్తున్నాయని చెప్పారు.
దేశానికి లౌకికవాదం, ప్రజాస్వామ్యమే శ్రీరామ రక్ష అని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని భట్టి పిలుపునిచ్చారు. ఈ యాత్రలో డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, నాయకులు పాల్గొన్నారు. పాదయాత్రలో భట్టికి పలుచోట్ల మహిళలు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నుంచి వైరా మీదుగా వెళ్తున్న ఏపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పినపాక వద్ద భట్టి పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment