సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. ఈ క్రమంలో 17 మందిని అరెస్ట్ చేసి 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. దీంతో, ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది.
వివరాల ప్రకారం.. సైబరాబాద్ పోలీసులు మరో సెక్స్ రాకెట్ ముఠా గుట్టురట్టు చేశారు. ఏపీ, తెలంగాణ, కర్నాటక, ముంబై, ఢిల్లీతో పాటుగా బంగ్లాదేశ్, నేపాల్, థాయిలాండ్, రష్యా దేశాలకు చెందన బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, 17 మంది సభ్యులు హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. కాల్ సెంటర్, వాట్సాప్ గ్రూపుల్లో స్లాట్స్ బుక్ చేస్తున్నారు. వీరి డ్రగ్స్ కూడా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు.. 39 కేసుల్లో 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో 14,190 మంది బాధితులకు విముక్తి కల్పించారు. కాగా, ఈ ముఠా పలు వెబ్‌సైట్లలో ఎస్కార్ట్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను, మహిళలను ఉపాధి పేరుతో తీసుకువచ్చి వారిని ఈ ముఠా వ్యభిచారం కూపంలోకి దింపుతోందని పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment