సాక్షి, హైదరాబాద్: మిచౌంగ్ తుపాను దూసుకొస్తోంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి.. రేపు మధ్యాహ్నం నెల్లూరు-మచిలీపట్నం మధ్య తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక, తెలంగాణపై కూడా తుపాను ప్రభావం చూపనుంది. దీంతో.. నేడు, రేపు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
తుపాన్ ప్రభావం ఇలా..
- తూర్పు దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్న గాలులు
- నేడు, రేపు తెలంగాణవ్యాప్తంగా ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు
- ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీచేసిన వాతావరణ శాఖ
- నేడు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు ఎల్లో అలెర్ట్ జారీ
- ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో వీచే అవకాశం
#CycloneMichaung🌀 Impact will start from Today Evening in #Telangana 🌨️🚨
— Hyderabad Rains (@Hyderabadrains) December 4, 2023
East Telangana District's will see Heavy -Very Heavy Rainfall starting from today Evening to 6th Early Morning ⚠️#Hyderabad overcast Weather with Light -moderate expected from tonight/Early Morning. pic.twitter.com/b2YL7vwB7D
- కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు
- రేపు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతిభారీ వర్షాలు, ఆరెంజ్ అలెర్ట్ జారీ
- నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ , హన్మకొండ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు ఈదురు గాలులు గంటకు 40 నుండి 50 కి.మీల వేగంతో వీచే అవకాశం
- మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
- దీంతో తెలంగాణవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగే అవకాశం
- ఉదయం వేళల్లో దట్టమైన పొగ మంచు ఉండే అవకాశం ఉంది.
Cyclone Michaung is brutally smashing Chennai city with 200-250mm rains & also Tirupati, Nellore side. Next in target is Ongole, Machilipatnam as Cyclone will cross the coast tomorrow at Bapatla
— Telangana Weatherman (@balaji25_t) December 4, 2023
From today evening/night , rain will start in Nalgonda, Suryapet, Khammam, Bhadradri pic.twitter.com/SgtXDhc7HI
Comments
Please login to add a commentAdd a comment