
నీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
మఠంపల్లి/హుజూర్‌నగర్ రూరల్: రాష్ట్రంలో మూడ్రోజులు గా కురిసిన భారీవర్షాలపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మె ల్యేలు, ప్రజాప్రతినిధులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకో వడం వల్లనే క్షేత్రస్థాయిలో పెను ప్రమాదం తప్పిందని భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన సూర్యాపేట జిల్లా హు జూ ర్‌నగర్ నియోజకవర్గంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మఠంపల్లి మండలం గుండ్లపల్లిలో ఎత్తిపోత ల పథకంను పరిశీలించి కృష్ణానదిరేవులో విలేకరులతో మా ట్లాడారు.
నష్ట పోయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని డ్యామ్‌లను పూ ర్తి స్థాయిలో నీరు నిల్వ చేసేందుకు డ్యామ్‌లలో ఉన్న పూడి కను తీస్తామని, అందుకు కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తా మని ఉత్తమ్ తెలిపారు. మఠంపల్లిలోని మామిళ్లచెరువుకట్ట తెగిపోయి వందలాది ఎకరాలు నీటమునిగిన పొలాలు, గండిపడిన చెరువును పరిశీలించేందుకు సరైన మార్గం లేకపోవడంతో 4 కి.మీ. ట్రాక్టర్‌పై ప్రయాణం చేశారు.
కాగా, ప్రకృతి సృష్టించిన బీభత్సానికి చెరువు కట్టలు తెగి వరదకు కొట్టు కుపోయి, ఇసుక మేటలు, రాళ్లు, మట్టి దిబ్బలతో నిండిపోయిన వరి పొలాల పంట నష్టంపై వివరాలను వెంటనే సేకరించాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. హుజూర్‌నగర్ మండల పరిధిలోని బూరుగడ్డలో తెగిన నల్లచెరువును ఆయన పరిశీలించి మాట్లాడారు. అనంతరం వరదకు దెబ్బతిన్న పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment