సాక్షి, హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై పటిష్టవంతమైన భద్రత ఏర్పాట్లు చేశామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. ఇప్పటికే నగరంలో ఉన్న అన్ని డీఆర్‌సీ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందితో చర్చించినట్లు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బల్దియా ఎన్నికలు నిర్వహించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని, కేంద్ర బలగాలు కూడా అందుబాటులో ఉన్నట్లు సీపీ చెప్పారు. ఇప్పటివరకు 9 కేసుల్లో పట్టుబడిన హవాలా నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పజెప్పామన్నారు. ఆయుధాల లైసెన్స్ కలిగిన వారు ఎన్నికల సమయంలో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని తెలిపారు. ఇప్పటికే 1500ల లైసెన్స్ ఆయుధాలు డిపాజిట్ అయినట్లు వెల్లడించారు. (టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి: పోసాని)
'బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అన్ని సున్నితమైన, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు గట్టి గట్టి బందోబస్తు ఉంది. స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాల నిఘా ఉంటుంది' అని సీపీ పేర్కొన్నారు. నగరవాసులు తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని తెలిపారు. ఎన్నికల నియమావళికి ఆటంకం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. (బీజేపీలోకి కొండా విశ్వేశ్వర్, సర్వే సత్యనారాయణ!)
Comments
Please login to add a commentAdd a comment