ఫ్యాషన్‌ డిజైనర్‌ కార్‌ టైర్లు కోసేసి.. షాప్‌ యజమానిని అడిగితే బెదిరింపులు | Fashion designer car tyre cut in banjara hills | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్‌ డిజైనర్‌ కార్‌ టైర్లు కోసేసి.. షాప్‌ యజమానిని అడిగితే బెదిరింపులు

Published Sat, Oct 19 2024 8:33 AM | Last Updated on Sat, Oct 19 2024 8:38 AM

Fashion designer car tyre cut in banjara hills

బంజారాహిల్స్‌: దుస్తులు కొనుగోలు చేసేందుకు దుకాణానికి వచ్చిన  ఫ్యాషన్‌ డిజైనర్‌ కారు టైర్లు ధ్వంసం చేసిన ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెల్తే... 

బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లో నివసించే ఫ్యాషన్‌ డిజైనర్‌ జి.కీర్తిరెడ్డి ఫ్యాబ్రిక్‌ కొనుగోలు చేసేందుకు బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ర్యాన్‌గ్రడ్జ్‌ ఫ్యాబ్రిక్‌ స్టోర్‌కు వచ్చారు. తన కారు టీఎస్‌ 09 ఈజెడ్‌ 1221ను ర్యాన్‌గ్రడ్జ్‌ ఫ్యాబ్రిక్‌ స్టోర్‌ ముందు పార్కింగ్‌ చేసి ఓ షాపులోకి వెళ్లి పది నిమిషాల్లో తిరిగి వచ్చారు.  

👉 కారు స్టార్ట్‌ చేసేందుకు ప్రయతి్నంచగా రెండు టైర్లు పూర్తిగా దెబ్బతిని కనిపించాయి. ఇనుప చువ్వలతో కారు టైర్లను కోసేసి గాలి తీశారని తెలిపారు. సదరు షాపులో పనిచేసే ఉద్యోగి తన కారును ధ్వసం చేశాడని చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులను కోరారు. తాను స్టోర్‌ యజమానికి ఫిర్యాదు చేయగా అసభ్యంగా మాట్లాడటమే కాకుండా బెదిరింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు. దీనికి కారణమైన షాపు నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలిన కోరారు. పోలీసులు ఆ స్టోర్‌ ఉద్యోగిపై బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 324(4), 125, 351(2), రెడ్‌విత్‌ 3(5) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement