![FLO StyleTatva](/styles/webp/s3/article_images/2024/07/21/0255.jpg.webp?itok=gawVKWPo)
మాదాపూర్: స్థానిక హైటెక్స్‌లో రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఫ్లో స్టైల్‌తత్వ ఎక్స్‌పోను బుల్లితెర నటి సుమ కనకాల, ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్రా, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ చైర్‌పర్సన్ ప్రియగజదార్‌లతో కలసి శనివారం ప్రారంభించారు. ప్రదర్శనలోని ఉత్పత్తులు అద్భుతంగా ఉన్నాయని, దీని ద్వారా వచ్చే ఆదాయంలో కొంతభాగం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా 100 మంది మహిళా రైతులకు కూరగాయల సాగులో ఆధునిక శిక్షణ ఇవ్వడం, సిద్దిపేట క్లస్టర్‌లో నైపుణ్యం పెంచే మహిళా నేత కారి్మకులకు శిక్షణ వంటి సామాజిక ప్రాజెక్టులకు కేటాయించడంతో సుమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
15 రాష్ట్రాల నుంచి 200లకు పైగా ఎంఎస్‌ఎంఈలను ఒకే వేదికపైకి తీసుకురావడం సులభం కాదని తెలిపారు. మహిళల సృజనాత్మకతను బయటకు తీసుకొచ్చేందుకు ఫిక్కీ ఎంతోకృషి చేస్తుందని ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్ర అన్నారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్ రంగ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని, దీనిపై విధానాన్ని రాష్ట్రప్రభుత్వం నెలరోజుల్లో ప్రకటించనున్నట్టు తెలిపారు.
రెండు రోజుల్లో 8వేల నుంచి 10వేల మంది సందర్శకులు సందర్శించనున్నట్టు ఫిక్కీ చైర్‌పర్సన్ ప్రియగజదార్ తెలిపారు. ఫ్లో సహాయక పారిశ్రామికవేత్తల పెవిలియన్, ఉద్యమం రిజి్రస్టేషన్ డెస్క్, తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్, సకల ది హ్యాండ్‌లూమ్స్, హ్యాండిక్రాఫ్ట్స్ ఇనిíÙయేటివ్ స్టాల్స్ ప్రత్యేకంగా ఉన్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment