తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్‌ | Himanshu Sings A Song For His Father Ktr | Sakshi
Sakshi News home page

తండ్రి కోసం హిమాన్షు పాట.. సంబరపడిపోయిన కేటీఆర్‌

Published Sat, Dec 28 2024 9:16 PM | Last Updated on Sat, Dec 28 2024 9:30 PM

Himanshu Sings A Song For His Father Ktr

తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: తన పట్ల ప్రేమతో కుమారుడు హిమాన్షు(Himanshu Rao) పాడిన పాటను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR) ఎక్స్ వేదికగా పంచుకున్నారు. తన తండ్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా యానిమల్(Animal) సినిమాలోని 'నా సూర్యుడివి.. నా చంద్రుడివి' అంటూ స్వయంగా పాట పాడిన హిమాన్షు.. తండ్రితో తనకున్న జ్ఞాపకాల ఫొటోలను కూడా యాడ్ చేసి వీడియోగా రూపొందించారు.

దీంతో తన కుమారుడు తన కోసం ఓ పాట పాడటంతో సంబరపడిపోయిన కేటీఆర్‌.. సోషల్ మీడియా(Social media)లో పోస్టు చేశారు. తన కొడుకు పాట విని ఒక తండ్రిగా తనకు చాలా సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు. కేటీఆర్‌కు ఆయన కుమారుడు హిమాన్షు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

జూలైలో నా పుట్టినరోజు కోసం నా కుమారుడు ఈ పాటను రికార్డ్ చేశాడని.. కానీ అది సంతృప్తికరంగా రాలేదని భావించి విడుదల చేయలేదని, తాను ఆ పాటను వారం క్రితం మొదటిసారి విన్నానని, హిమాన్షు పాట సాహిత్యం.. గానం అద్భుతంగా ఉందని కేటీఆర్‌ ప్రశంసించారు. తాను దీని పట్ల తండ్రిగా ఎంతో గర్వపడుతున్నానన్నారు. కష్టతరమైన సంవత్సరంలో నాకు ఉత్తమ బహుమతి అందించిన బింకు(హిమాన్షు)కు అభినందనలంటూ కేటీఆర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, తన పాటను తండ్రి కేటీఆర్ మెచ్చుకోవడం చాలా ఆనందంగా ఉందని హిమాన్షు రీట్వీట్ చేశారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement